సంక్రాంతి పండుగ.. ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగ.. ప్రత్యేక రైళ్లు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, విజయవాడ, అనకాపల్లికి ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికుల సౌకర్యార్థం TGSRTC కూడా 6,431 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌కు ప్రత్యేక రైళ్లను కేటాయించారు. ఈ స్పెషల్ ట్రైన్లు జనవరి 9, 10 తేదీల్లో హైదరాబాద్ నుంచి బయల్దేరుతాయి. కాగజ్‌నగర్ – హైదరాబాద్ ట్రైన్లు తిరుగు ప్రయాణంలో జనవరి 9, 18 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ఇక ఏపీకి వెళ్లే ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి, హైదరాబాద్ స్టేషన్ల నుండి ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేశారు.

హైదరాబాద్ – విజయవాడ: జనవరి 9, 10 తేదీల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఇవి తిరిగి జనవరి 9, 18 తేదీల్లో విజయవాడ నుండి హైదరాబాద్‌కు వస్తాయి. ఈ రైళ్లు చర్లపల్లి, వరంగల్, ఖమ్మం మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

చర్లపల్లి – అనకాపల్లి: పండుగ రోజైన జనవరి 14న చర్లపల్లి స్టేషన్ నుండి అనకాపల్లికి ప్రత్యేక రైలు బయల్దేరుతుంది. తిరిగి జనవరి 15న అనకాపల్లి నుండి చర్లపల్లికి ప్రయాణికులను చేరవేస్తుంది.

6,431 ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని TGSRTC భారీ ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల కోసం ఏకంగా 6,431 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే జనవరి 9, 10, 12, 13 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 18, 19 తేదీల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. MGBS, JBS, ఎల్బీ నగర్, ఉప్పల్, గచ్చిబౌలి వంటి ప్రధాన కూడళ్ల నుండి బస్సులు బయల్దేరుతాయి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page