ముషీరాబాద్‌లో ఘనంగా రంజాన్ పండుగ
హైదరాబాద్, మార్చి 21, అద్దం న్యూస్ : రంజాన్ పండుగ ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మోయిన్ భక్ష్ ఆధ్వర్యంలో జరిగిన రంజాన్ పండుగ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాంనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి మోయిన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జైసింహా, ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండ శ్రీధర్‌రెడ్డి, నాయకులు రేషం మల్లేష్, నాయిని దేవేందర్ రెడ్డి, అజయ్ ముదిరాజ్, సిరిగిరి శ్యామ్, డేగల బిక్షపతి యాదవ్, తలారి శ్రీకాంత్ ముదిరాజ్, కొండా సహదేవ్, ముత్యం బాల్‌రాజ్‌గౌడ్, బూడిది లక్ష్మణ్ గౌడ్, గంటల రాజు, నక్క మహేందర్ గౌడ్, నరేష్ యాదవ్, సదా, పరుశురామ్ యాదవ్, అభినందన్ యాదవ్, భాస్కర్ యాదవ్, నాని తదితరులు పాల్గొన్నారు.















Leave a Reply