Saturday, September 19, 2026
No menu items!
Homecinemaఫస్ట్ గ్లింప్స్..

ఫస్ట్ గ్లింప్స్..

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా ప్రస్తుతం లేడీ ఓరి యెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. వాణిజ్యపరమైన సినిమాలతో పాటు, కథానాయికకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటూ తన కెరీర్ను కొత్త దిశలో తీసుకెళ్తుంది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రష్మిక హవా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా పనక్కర్లేదు. ఆమె నటించిన ఛావా, రామా, కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ వంటి చిత్రాలు వందల కోట్ల వసూళ్లతో సంచలనాలు సృష్టించాయి. ముఖ్యంగా ‘ది గర్ల్ ఫ్రెండ్’లో అమాయకమైన యువతిగా ఆమె చూపించిన నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు అదే రష్మిక పూర్తిగా భిన్నమైన అవతారంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

గర్ల్ ఫ్రెండ్’ తర్వాత రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. గ్లింప్స్ ఆరంభంలో వినిపించే వాయిస్ ఓవర్ ప్రేక్షకులను వెంటనే కథలోకి లా గేస్తోంది. “నా బిడ్డ ఊపిరి మోయలేక అగే బూడిదైంది. నా బిడ్డను సంపలేక ఆఖరికి సావే సచ్చిపోయింది” అనే డైలాగులు పాత్రలోని వేదన, కోపాన్ని తీవ్రంగా ప్ర తిబింబిస్తున్నాయి. గోండు నేపథ్యం తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్యాయానికి ఎదురు నిలిచే ఓ సహజ నాయకు కథను చెబుతుందని సమాచారం.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page