హైదరాబాద్, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ : జలమండలి ట్రాన్స్మిషన్ చీఫ్ జనరల్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ… జలమండలి క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉన్న రవీందర్ రెడ్డి పదవీ విరమణ సందర్భంగా బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి ఇంజనీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శాలువా, మెమోంటోలతో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హజరైన జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి హాజరై రవీందర్ రెడ్డి సేవలను ప్రశంసించారు. పదవీ విరమణ తర్వాత కుటుంబ సభ్యులతో సమయం గడపాలని, జీవితం హాయిగా గడవాలని ఎండీ ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్స్ డైరెక్టర్లు ప్రవీణ్ కుమార్, అమరేందర్ రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్లు సుదర్శన్, శ్రీధర్ లతో పాటు సీజీఎమ్‌లు, జీఎమ్‌లు, ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png