పదవ తరగతి పరీక్షల్లో రాణించిన ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ విద్యార్థులు
హైదరాబాద్, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ : పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడకు చెందిన ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ విద్యార్థులు సత్తాచాటారు. ఈ పాఠశాల నుంచి పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణులయ్యారు. 183 మందిలో 91 మంది బాలికలు కాగా, 92 మంది బాలురులు పరీక్షలు రాశారు. అందరూ పాసయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పులిగారి గోవర్థన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ పి.స్వర్ణ లత తదితరులు పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులకు ఘనంగా సన్మానం చేశారు. స్వీట్లు తినిపించి అభినందించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply