ఏడు వరాలతో దివ్యాంగులకు పునర్జన్మ
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, డిసెంబర్ 6, అద్దం న్యూస్ : ఏడు వరాలతో దివ్యాంగులకు పునర్జన్మ అని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడు వరాలుస ( సప్త దీవెనలు ) దివ్యాంగుల చిరకాల వాంఛ అయిన రాజ్యాధికారంలో భాగస్వామ్యాన్ని కల్పించే దిశగా చారిత్రక అడుగు అని, దానికి వికలాంగులకు కృతజ్ఞత పూర్వకంగా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి శనివారం పాలభిషేకం జరిగింది. హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు పి.సాయిబాబా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ… ఏడు వరాలు దివ్యాంగులకు పునర్జన్మ అని, ఎన్నో తరాలుగా ఇంటికి భారంగా, ఇతరులపై ఆధారపడే జీవనం గడుపుతున్న దివ్యాంగులకు సరైన ప్రోత్సాహం అందిస్తే వారు సమాజానికి వరంగా మిగులుతారని చంద్రబాబు నాయుడు ఆలోచించారని అన్నారు. ముఖ్యంగా రాజకీయంగా వారికి నామినేషన్ కల్పించడం, ప్రతి గ్రామ పంచాయతీలో ఒక వికలాంగుని ఎక్స్ అఫీషియల్ మెంబరుగా నామినేట్ చేస్తామని, అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర కమిటీలలో కూడా దివ్యాంగులకు నామినేషన్ అవకాశం కల్పిస్తామని ప్రకటించడం ముదావహం అని అన్నారు.
చట్టసభల్లో అవకాశం కల్పించడం, ఈ చర్య భవిష్యత్తులో చట్టసభలలో ( అసెంబ్లీ, పార్లమెంటు, లోక్సభ ) కూడా దివ్యాంగులకు రిజర్వేషన్లు లభించేందుకు మార్గం సుగమం చేస్తుందని, తద్వారా వారు తమ సమస్యలపై ఇతరుల మీద ఆధారపడకుండా తమ హక్కుల కోసం తామే పోరాడుకునే స్థితిని కల్పిస్తుందన్నారు. మహిళలకు ఇస్తున్న విధంగానే దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వ గృహాల ( ఇళ్ల ) కేటాయింపులో దివ్యాంగులకు కింది అంతస్తులోని ఇల్లు కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దివ్యాంగులలోని ప్రతిభను వెలికి తీసేందుకు, ఎంత ఖర్చయినా సరే ప్రోత్సాహం అందించాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు. మానవత్వంతో కూడుకున్న ఏడు వరాలకు గాను తెలంగాణ వికలాంగుల సమాజం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేసి, హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దివ్యాంగుల జీవితాల్లో మార్పులు తీసుకురాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా దివ్యాంగుల పెన్షన్ను నెలకు రూ.4,000 నుండి రూ.6,000 లకు వెంటనే పెంచాలని, ఉచిత రవాణా: ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు ( 470 ) తక్షణమే భర్తీ చేయాలన్నారు. ఉపాధి, రుణాలు, స్వయం ఉపాధి కోసం రుణాలు మంజూరు చేయాలన్నారు. అనంతరం బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా జిల్లా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నగర నాయకులు కిషోర్, బాలరాజు గౌడ్, ఎస్.ప్రకాష్, కిరణ్, భానుప్రకాష్, సుదర్శన్ రెడ్డి, వికలాంగుల సమాజం నాయకులు భాగ్యమ్మ, రంగమ్మ, ధనలక్ష్మి, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply