ప్రధాని మోడీ నిర్ణయంతో సామాన్యునికి ఊరట   – బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

ప్రధాని మోడీ నిర్ణయంతో సామాన్యునికి ఊరట  

– బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 05, అద్దం న్యూస్ :     రానున్న దీపావళికి ప్రజలకు మోడీ జిఎస్‌టి పన్నుపై భారీ మినహాయింపు కానుక ఇవ్వ‌నున్నార‌ని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ అన్నారు. జిఎస్‌టి పై ప‌న్ను మిన‌హాయిస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌డంతో శుక్ర‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లి త్యాగ‌రాయ‌గాన స‌భ చౌర‌స్తా వ‌ద్ద ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడి చిత్ర ప‌టానికి పాలాభిషేకం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజ‌రై మోడి చిత్ర ప‌టానికి పాలాభిషేకం చేశారు. ఈ సంద‌ర్భంగా విన‌య్ కుమార్ మాట్లాడుతూ… రోజు వాడే నిత్యావసరాల వస్తువులు సబ్బులు,హెయిర్ ఆయిల్, పాల ఉత్పత్తులు, కుట్టుమిషన్ పలు వస్తువులపై 18 నుండి 5 శాతం, చికిత్స, మెడికల్ ఉత్పత్తులపై 18, 12 నుండి 5 శాతం, విద్యాభ్యాసం కోసం ఉపయోగించే సామాగ్రి పై పూర్తి స్థాయి జిఎస్‌టి మినహాయింపు, వ్యవసాయ ఉత్పత్తులు, ట్రాక్టర్లు, రైతు ఉపయోగించే ఆధునిక వ్యవసాయ పరికరాలు 12 శాతం నుండి 5 శాతం, మోటార్ వెహికల్ కొనుగోలు, పెట్రోల్,డిసిల్, సిఎన్‌జి, ఎల్‌పిజి గ్యాస్ పై 28 శాతం నుండి 18 శాతానికి, ఎయిర్ కూలర్, టెలివిజన్, మొనీటర్, ప్రొజెక్టర్, వాషింగ్ మిష‌న్ల‌పై 28 శాతం నుండి 18 శాతానికి జిఎస్‌టి పన్ను చెల్లింపు మినహాయింపు ప్రకటించినందుకు మోడికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం పట్ల దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.                                           ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వి.నవీన్, ఆనంద్‌రావు, అసెంబ్లీ కన్వీనర్ రమేష్ రామ్, బిజెపి సీనియర్ నాయకులు సాయి, శ్రీకాంత్, పి.నర్సింగ్ రావు, ఎం.ఉమేష్, సురేష్, రాజు, శివ కుమార్, సురేష్ ముదిరాజ్, సాయి కుమార్, బాల కుమార్, సత్యేంధర్, రఘు, నీరజ్, సంయుక్త రాణి తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page