Saturday, September 19, 2026
No menu items!
HomecinemaRenu Desai: నొప్పిని భరిస్తూనే..

Renu Desai: నొప్పిని భరిస్తూనే..

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: దాదాపు 20 ఏండ్ల లాంగ్ గ్యాప్ తర్వాత టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది నటి రేణు దేశాయ్ (Renu Desai). అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ఆ తర్వాత రేణు డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూకట్టిన ఆమె సున్నితంగా తిరస్కరించింది. మళ్లీ దాదాపు రెండేళ్ల విరామం తీసుకున్న తర్వాత ‘పదహారు రోజుల పండుగ’. చిత్రంలో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి కాగా.. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఇదిలాఉండగా.. తాజాగా రేణు దేశాయ్ హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసి షాకిచ్చింది. దీనికి సంబంధించిన విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

‘దాదాపు 26 ఏండ్ల తర్వాత ర్యాంప్ పై నడిచేందుకు వేదికపైకి వెళ్లడానికి 10 నిమిషాల ముందు నా పర్సనల్ మేకప్మెన్ ఇనుప స్టాండ్ మీది నుంచి జారిపడ్డాడు. బరువైన -వస్తువు అతని తలను తాకింది. ఆ క్షణంలో నాకు చుక్కలు కనిపించాయి. అతని పరిస్థితి తలచుకుని నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అదే సమయంలో షో ప్రారంభం కావడంతో నేను ఏం చేయలేకపోయా. ఆ నొప్పిని, బాధను భరిస్తూనే వాక్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నన్ను గమనించినట్లయితే కళ్లుగా ఎర్రగా నీటితో నిండి ఉంటాయి. నేను ప్రస్తుతం చాలా బాధలో ఉన్నాను.. షోలో గందరగోళం లేకుండా ఉండటానికి నా వంతు ప్రయత్నం చేశాను. దీనిని వ్యక్తిగత కారణాల వల్ల పంచుకోవడం లేవు. కొన్నిసార్లు ఒక వ్యక్తి ఎలాంటి బాధను అనుభవిస్తున్నాడో, తన పరిస్థితిని కొనసాగించడానికి ఎంత కష్టపడుతున్నాడో తెలియదు. మనకు అందుకే తోటివారి పట్ల మరింత దయతో ఉండాలి’ అంటూ రేణుదేశాయ్ రాసుకొచ్చింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page