Saturday, September 19, 2026
No menu items!
HomeAPటిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు

టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు

📰 Generate e-Paper Clip

టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు

హైదరాబాద్, జ‌న‌వ‌రి 26, అద్దం న్యూస్ :   తెలుగుదేశం పార్టీ హైద‌రాబాద్ న‌గ‌ర కార్యాల‌యంలో సోమ‌వారం గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు ఎం.అర‌వింద్ కుమార్ గౌడ్ హాజ‌రై జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేశారు. జాతీయ పతాకానికి వందనం చేస్తూ జాతీయ గీతం ఆలపించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి వారిని స్మరించుకున్నారు. ఈ సందర్బంగా అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… ఈ రోజు మన రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న సుదినం అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి అందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజ్యాంగ వ్యవస్థను బలహీన పర్చడానికి కుట్రలు జరుగుతున్నాయన్నారు. దేశ ప్రజలందరూ రాజ్యాంగం అత్యంత పవిత్రమైనదిగా భావించి, రాజ్యాంగ విలువల్ని కాపాడి భావితరాలకు అందించాల్సిన భాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర నాయ‌కులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, పరుశురాం, మేడిపల్లి శ్యాంసుందర్, రాజేందర్ ప్రసాద్ ( ఆర్‌పి ), కరణం కిరణ్, భాను ప్రకాష్, ఓ.వెంకటేష్ చౌదరి, చంద్రమోహన్ గౌడ్, మతిన్, పి.వీరబాబు, ఎస్.ఎం.లైకొద్దీన్, మచ్చేందర్, జోగేందర్ సింగ్, యాదగిరి, సాయి, ఎండి.సలీం, బి.రాజు, వెంకట్రాజన్ గౌడ్, అమ్మి నాయుడు, బిక్షపతి చారి, మచ్చేందర్, ఎల్.రవి, సత్తన్న, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page