ముషీరాబాద్ డివిజ‌న్‌లో పెండింగ్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించండి – బిఆర్ఎస్ పార్టీ యువ‌జ‌న విభాగం నాయ‌కుడు ముఠా జైసింహా

హైదరాబాద్, జూన్  24, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ డివిజ‌న్‌లో పెండింగ్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని బిఆర్ఎస్ పార్టీ యువ‌జ‌న విభాగం నాయ‌కుడు ముఠా జైసింహా కోరారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న చిల‌క‌ల‌గూడ వాట‌ర్ వ‌ర్క్స్ కార్యాల‌యంలో డిజిఎం మోహ‌న్‌రాజ్‌ను క‌లిసారు. ఈ సంద‌ర్భంగా ముషీరాబాద్ డివిజ‌న్‌లో పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్య‌ల పై చ‌ర్చించారు. డివిజ‌న్‌లో అభివృద్ధి ప‌నుల‌పై స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ముఠా జైసింహా మాట్లాడుతూ… ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ చొర‌వ‌తో అభివృద్ధి జ‌రుగుతుంద‌న్నారు. అభివృద్ధి కోసం అధికారులు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఇందుకు స్పందించిన డిజిఎం మోహ‌న్‌రాజ్ డివిజ‌న్‌లో పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కొండా శ్రీధర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు జావీద్, జఫ‌ర్‌, మునావ‌ర్ చాంద్, సయ్య‌ద్‌ సర్వర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page