Sunday, September 20, 2026
No menu items!
HomeHyderabadపెచ్చులూడిన ఆలయ స్లాబును పునరుద్ధరించండి  - బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు ముఠా జై సింహ 

పెచ్చులూడిన ఆలయ స్లాబును పునరుద్ధరించండి  – బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు ముఠా జై సింహ 

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, అద్దం న్యూస్ : పెచ్చులూడిన ఆలయ స్లాబును పునరుద్ధరించాలని బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు ముఠా జై సింహ అధికారులను కోరారు. బుధవారం ఆయన ముషీరాబాద్‌ మహంకాళి దేవాలయాన్ని సందర్శించారు. సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పెచ్చులూడిన‌ స్లాబ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ముఠా జై సింహ ఆలయ ఈవో మహేందర్ కు ఫోన్ చేశారు. ముషీరాబాద్ మహంకాళి దేవాలయం స్లాబ్ కూలి నెలలు గడుస్తున్న ఎందుకు మరమ్మతులు చేయడం లేదని ప్రశ్నించారు. అందుకు స్పందించిన ఆలయ ఈవో మహేందర్ అతి త్వరలోనే స్లాబ్ మరమ్మత్తు పనులు ప్రారంభిస్తామని తెలిపారని ముఠా జైసింహా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ ఎయిర్‌టెల్ రాజు, ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండా శ్రీధర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు దీన్ దయాళ్ రెడ్డి, సత్యనారాయణ బాబు, శ్రీకాంత్, బలవంత్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page