Friday, September 18, 2026
HomeHyderabadఆటో డ్రైవర్ల ఆత్మ హత్యలు మరచి పర్మిట్ల దందాకు తెరలేపిన రేవంత్ సర్కార్ ...

ఆటో డ్రైవర్ల ఆత్మ హత్యలు మరచి పర్మిట్ల దందాకు తెరలేపిన రేవంత్ సర్కార్ – తెలంగాణ స్టేట్ ఆటో డ్రైవర్ల ఐక్య కార్యాచరణ సమితి

హైదరాబాద్, జూన్ 17, అద్దం న్యూస్ :    ఆటో డ్రైవర్ల ఆత్మ హత్యలు మరచి పర్మిట్ల దందాకు తెరలేపిన రేవంత్ సర్కార్.. తన విధానాలు మార్చుకోవాలని ఆటో డ్రైవ‌ర్ల జేఏసి డిమాండ్ చేసింది. మంగ‌ళ‌వారం హైద‌ర్‌గూడ ఎన్ఎస్ఎస్‌లో తెలంగాణ స్టేట్ ఆటో డ్రైవర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో బిపిటిఎంఎం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రవిశంకర్ అల్లూరి, టిఎడియు నాయ‌కుడు కొమ‌ర‌య్య‌, టిఆర్ఎకెటియు నాయ‌కుడు ఈశ్వ‌ర్‌, బిఎంఎస్ నాయ‌కులు హ‌బీబ్‌, టిఎస్ఎడియు నాయ‌కుడు పెంట‌య్య గౌడ్‌, జిహెచ్ఎడియు నాయ‌కుడు కిష‌న్‌, జిహెచ్ఎవిడియు నాయ‌కుడు వ‌జ్ర లింగం, బిఎంఎస్ నాయ‌కుడు అశ్విన్ రాజు, సాయికుమార్ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బిపిటిఎంఎం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రవిశంకర్ అల్లూరి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉచిత హామీలు ఇచ్చి దానిలో ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదన్నారు. మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ఆటో డ్రైవర్లు ఆత్మ హత్యలు చేసుకునేలా చేసి పరోక్షంగా ఆటో డ్రైవర్లను హత్యలు చేస్తున్నదని విమ‌ర్శించారు. రాష్ట్రంలో ఉపాధి దెబ్బతిని తమ కుటుంబాలను పోషించుకోలేక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆర్థికంగా ఆదుకోలేని ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో క్రొత్తగా ఆటో పర్మిట్లు ఇచ్చి అక్రమ దందాకు తెరలేపిందన్నారు. అసలే ఆటోలు నడవక గిరాకీలు దెబ్బతిని ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతుంటే మరిన్ని ఆటోలకు పర్మిషన్ ఇవ్వడం అంటే ఇంకా ఆత్మహత్యలను ప్రోత్చహిస్తున్నది అనడంలో సందేహంలేద‌న్నారు. ఇక ప్రతిపక్ష పార్టీ అనుబంధ సంఘం అయిన బిఆర్ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం, కమ్యూనిస్టు కార్మిక సంఘం అయిన ఎఐటియుసి లు కలసి సిపిఐ ఎమ్మెల్యేతో కలసి లాబీయింగ్ చేసి ఈ రోజు క్రొత్త ఆటోలకు పర్మిట్లు తెచ్చి డ్రైవర్లను ఇబ్బంది పాలు చేయడం ద్వారా ఆటో డ్రైవర్లను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆటోలే నడవడం లేదంటే క్రొత్త ఆటోలు ఎందుకు అని ప్ర‌శ్నించారు. క్రొత్త పర్మిట్ల జూన్ 7 ఆటో పర్మిట్ల జీఓ లో మార్పు చేయాలని, ఎల్‌పిజి, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ ఆటోలు పాత ఆటో పర్మిట్ల స్థానంలోనే ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఎలక్ట్రికల్ ఆటోలపై 50 శాతం సబ్సిడీ ఇచ్చి జాతీయ బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించాలని, ఆటో లైసెన్స్ తీసుకున్న ఆటో డ్రైవర్ కి మాత్రమే ఆటో ఇవ్వాలన్నారు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page