Friday, September 18, 2026
HomeHyderabadరెవెన్యూ పెంచాలి – జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్

రెవెన్యూ పెంచాలి – జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్

 

హైదరాబాద్, ఏప్రిల్ 9, అద్దం న్యూస్ :   రెవెన్యూ పెంచాలని జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ అన్నారు. జలమండలి అధికారులతో బుధవారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలోఆయ‌న‌ రెవెన్యూ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ మాట్లాడుతూ… రెవెన్యూ పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందులో భాగంగా ఇప్పటీ వరకు అధిక బకాయిఉన్న కనెక్షన్లను గుర్తించి ప్రత్యేక దృష్టి సారిస్తే ప్రతినెల బోర్డుకు మరింత ఆదాయం సమకూరనుందన్నారు. అలాగే వాణిజ్య క‌నెక్ష‌న్ల బకాయిల పైన దృష్టి సారించాల‌ని, దీర్ఘ కాలంగా బిల్లులు చెల్లించ‌ని వాణిజ్య క‌నెక్ష‌న్ల నుంచి బ‌కాయిలు వ‌సూలు చేయాల‌ని సూచించారు. ఈ సమావేశంలో జలమండలి ఈఎన్‌సి- ఆపరేషన్ డైరెక్టర్ -2 విఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్ డైరెక్టర్ -1 అమరేందర్ రెడ్డి, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page