శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర పై నిఘాపెట్టండి
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు ఆదేశాలిచ్చిన నగర పోలీస్ కమిషనర్, డిజి సివి.ఆనంద్
హైదరాబాద్, అద్దం న్యూస్ : ఈ నెల 12 వ తేదీన జరుగనున్న శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా హైదరాబాద్ పోలీసు అధికారులతో డిజి, నగర పోలీస్ కమిషనర్ సివి.ఆనంద్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా జరిగిన సంఘటనలు, బందోబస్తు ఏర్పాట్ల విషయమై చర్చించి వారికి తగిన సూచనలు జారీచేశారు. చిన్న ఊరేగింపుల అనుసంధానం అయ్యే కూడలి వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సివి.ఆనంద్ సూచించారు. మతపరమైన ప్రదేశాల వద్ద సమస్యాత్మకమైన ప్రాంతాలలో ప్రత్యేక అదనపు బలగాలను మోహరించాలని నిరంతరం నిఘా కొనసాగించాలని సూచించారు. ముందస్తు చర్యగా సంబంధిత ఎస్‌హెచ్ఓలు శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర మార్గమైన శ్రీ రామ మందిరం గౌలిగూడ నుండి ప్రారంభమై బైబిల్ హౌస్ నుండి తాడ్ బండ్ హనుమాన్ టెంపుల్ వరకు క్షణంగా పరిశీలించి ఏదైనా అవాంతరాలు ఉన్నచోట సంబంధిత అధికారులకు తెలిపి సరి చేయాలని సివి.ఆనంద్ ఆదేశాలు చేశారు. ఊరేగింపులో డీజే సిస్టమ్‌లను ఉపయోగించకుండా ఉండటం వలన ప్రజల, భక్తుల ఆరోగ్యం పట్ల వారికి మేలు చేసినట్లవుతుందని నిర్వాహకులకు తెలియచేయాలని అన్నారు. ఫైర్ క్రాకర్లు పేల్చడం, బాట సారులపై వేయటం లేదా గులాల్ రంగు పోయటం చేయవద్దు అని నిర్వాహకులకు తెలుపాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విజయ యాత్ర ముగిసిన తరువాత, తిరుగు ప్రయాణములో వెళ్ళేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరము ఎంతైనా ఉందన్నారు. రెచ్చగొట్టే బ్యానర్‌లను ప్రదర్శించడం చేయకూడదని తెలిపారు. పరిమిత సంఖ్యలో వాహనాలను ఉపయోగిస్తూ ఇతర వర్గాల ప్రజలకు ఎలాంటి ఆటంకం కులకకుండా చూసుకోవాలని అన్నారు.
పోలీసు శాఖ ముందస్తు అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాల వినియోగం అనుమతించబడదు అని నిర్వాహకులకు తెలియజేయాలన్నారు. సోషల్ మీడియాలో పుకార్లను నమ్మ వద్దు, రెచ్చగొట్టే పోస్ట్‌లు, ఫేక్ మెసేజ్‌లు వాటిని వ్యాప్తి కాకుండా చూడాలన్నారు. ప్రత్యేకంగా శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర ఎలాంటి పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్ లు జరగకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కమిషనర్ పోలీస్ లా అండ్ ఆర్డర్ విక్రమ్ సింగ్ మాన్, స్పెషల్ బ్రాంచ్ డిసిపి ఎస్.చైతన్య కుమార్, ఐటి సెల్ డిసిపి పుష్ప, వర్చువల్ గా జోనల్ డిసిపిలు, ఇన్స్పెక్టర్లు ఏసీపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply