Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఅన్ని ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లో ఉచిత విద్యా హ‌క్కు చ‌ట్టాన్ని అమ‌లు ప‌ర‌చాలి – జిల్లా...

అన్ని ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లో ఉచిత విద్యా హ‌క్కు చ‌ట్టాన్ని అమ‌లు ప‌ర‌చాలి – జిల్లా డిఈఓ రోహిణికి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేసిన సిరిగిరి శ్యామ్‌

📰 Generate e-Paper Clip

అన్ని ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లో ఉచిత విద్యా హ‌క్కు చ‌ట్టాన్ని అమ‌లు ప‌ర‌చాలి

– జిల్లా డిఈఓ రోహిణికి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేసిన సిరిగిరి శ్యామ్‌


హైదరాబాద్, జులై 28, అద్దం న్యూస్ :     అన్ని ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లో ఉచిత విద్యా హ‌క్కు చ‌ట్టాన్ని అమ‌లు ప‌ర‌చి ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థుల‌కు నాణ్య‌మైన‌ విద్య‌నందించాలని ఆల్ ఇండియా హ్యూమ‌న్ రైట్స్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షుడు సిరిగిరి శ్యామ్ కుమార్ అన్నారు. ఈ మేర‌కు సోమవారం ఆయ‌న హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ( డిఈఓ ) ఆర్.రోహిణి ని క‌లిసి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా సిరిగిరి శ్యామ్ మాట్లాడుతూ… ఉచిత విద్యా హక్కు చట్టం అమ‌లు చేయ‌క‌పోగా ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లో పేద విద్యార్థుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లో ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థుల‌కు నాణ్యమైన విద్య దూరంగా ఉంద‌న్నారు. భారత ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 44 పర్సంటేజ్ ప్రకారం అన్ని ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లో ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థుల‌కు ఉచిత విద్యా హ‌క్కు చ‌ట్టం అమ‌లు చేయాల‌న్నారు. ఈ విద్య హ‌క్కు చ‌ట్టం అమ‌లులోకి వ‌స్తే ఎంతో మంది నిరుపేద విద్యార్థుల‌కు నాణ్యమైన విద్య అందుతుంద‌ని, విద్యా హ‌క్కు చ‌ట్టం అమ‌లు చేసేలా అధికారుల‌కు డిఈఓ కు కోరామ‌న్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page