కల్వర్టు గుంతలో పడిన బైక్‌.. ముగ్గురి మృతి

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ అదుపు తప్పి కల్వర్టు గుంతలో పడటంతో ముగ్గురు మృతిచెందారు. నారాయణఖేడ్‌ శివారులో నిజాంపేట్‌-బీదర్‌ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న 161బి హైవేపై కల్వర్టు కోసం తవ్విన గుంతలో బైక్‌ పడింది. దీంతో ఆవుటి నర్సింహులు (27), జిన్న మల్లేశ్‌ (24), జిన్న మహేశ్‌ (23) మృతిచెందారు. మృతులను నారాయణఖేడ్‌ మండలం నర్సాపూర్‌ వాసులుగా గుర్తించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page