...

ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘo నేతల చర్చలు విఫలం – మే 7వ తేదీన సమ్మెకు పిలుపు

 

ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘo నేతల చర్చలు విఫలం

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం

– మే 7వ తేదీన సమ్మెకు TGSRTCపిలుపు

– తెలంగాణ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ

హైదరాబాద్, ఏప్రిల్ 7, అద్దం న్యూస్ :    ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు పరచాలని హామీలు నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలంగాణ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది. సోమవారం హైద‌రాబాద్‌లోని రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయంలో తెలంగాణ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు శాఖ అధికారులతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో మే 7న సమ్మెకు పిలుపునిస్తూ కార్మిక శాఖ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వెంకన్న మాట్లాడుతూ… సమ్మె నోటీసులో 21 అంశాలు ప్రస్తావించామని ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం యాజమాన్యాలను ఎన్నో విధాలుగా ఒత్తిడి చేసిన వారి నుంచి స్పందన రాకపోవడంతో సమ్మె అనివార్యమైందన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన నేటి వరకు ఆ సమస్య ఓ కొలిక్కి రాలేదన్నారు. ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన నేటి వరకు సమస్యను పరిష్కరించలేకపోయారని విమర్శించారు. యూనియన్లను పునరుద్ధరించడం వలన ప్రభుత్వానికి గాని… యాజమాన్యానికి గాని ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ లేవన్నారు. ట్రేడ్ యూనియన్లు లేకపోవడంతో కార్మికులు యాజమాన్యం వత్తిళ్లకు వధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2017 వేతన సవరణ జరిగిన నేటికీ ఏరియార్స్ రాకపోవడం విచారకరమన్నారు. ఆర్టీసీ లాభాల బాట అంటూ ఇప్పటివరకు పిఆర్‌సి ఊసేలేదని… రిటైర్డ్ అయిన ఆర్టీసీ కార్మికులకు ఇప్పటి వరకు వేతనాలు చెల్లించలేదని వాపోయారు. పిఆర్‌సి లేదు జీతాలు లేవనీ ఆవేదన చెందారు.

జేఏసీకో– చైర్మన్ హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ… 2021 వేతన సవరణ కాల పరిమితిని అయిపోయినందున వెంటనే వేతన సవరణ జరిపి కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. ఉద్యోగుల పనిగంటలు 12 నుంచి 16 గంటల వరకు చేస్తున్నారని దానిని ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని కోరారు. ఎలక్ట్రికల్ బస్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీకి సరఫరా చేసి ఎలక్ట్రికల్ బస్సులను మ్యానుఫ్యాక్చరింగ్ నుండి హైర్ బేసిస్‌లో తీసుకోవడం వలన సంస్థ ఉనికి ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. రిక్రూట్‌మెంట్‌ లేకపోవడం వలన ఉద్యోగులపై పని భారం పడుతుందని రిటైర్డ్ అయిన ఉద్యోగుల పని భారాన్ని కూడా సర్వీసులో ఉన్న ఉద్యోగులకు బోయలేక అవస్థలు పడుతూ అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ఇప్పటికే 40 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టిసి ఎండి సజ్జనార్ కు, లేబర్ కమిషనర్ అధికారినికి రెండు మార్లు వినతి పత్రాలు సమర్పించిన కూడా స్పందించడం లేదన్నారు. ఎలక్షన్ కోడ్ అంటూ మాటను దాటవేసిన లేబర్ జాయింట్ కమిషనర్ అధికారిని ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే దిశగా చాప కింది నీరులా కొనసాగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిక ఆర్టీసీ కార్మికులంతా మే 7వ తేదీన ఉధృతంగా సమ్మె బాట పట్టుకున్నట్టు తెలిపారు. ఈ సమ్మెలో వైస్ చైర్మన్ థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండి.మౌలానా, కో – కన్వీనర్ కె.యాదయ్య, సురేష్, యాదగిరి, తదితర నాయకులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.