Sunday, September 20, 2026
No menu items!
HomeNationalరూపాయి విలువ మరింత పతనం..

రూపాయి విలువ మరింత పతనం..

📰 Generate e-Paper Clip

డాలర్‌తో పోలిస్తే ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి చేరిక

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదుడుకుల ప్రభావంతో రూపాయి విలువ శుక్రవారం మరింతగా క్షీణించి ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి చేరుకుంది. శుక్రవారం ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ ఏకంగా 20 పైసలు పతనమైంది. దీనితో డాలర్‌తో రూపాయి విలువ రూ.90.52 కు చేరుకుంది.

ర్థిక నిపుణుల అభిప్రాయం..

రూపాయి విలువ ఇలా ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి చేరడం వలన దేశీయంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగి, ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇంధనం, ఎలక్ట్రానిక్స్ వంటి దిగుమతి ఆధారిత వస్తువులపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం రూపాయి విలువను స్థిరీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page