...

ఎన్‌టిఆర్‌కు ద‌త్త‌పుత్రుడిగా పేరు తెచ్చుకున్న‌ సాయిబాబా మృతి చెంద‌డం బాధాక‌రం – టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అర‌వింద్ కుమార్ గౌడ్

ఎన్‌టిఆర్‌కు ద‌త్త‌పుత్రుడిగా పేరు తెచ్చుకున్న‌ సాయిబాబా మృతి చెంద‌డం బాధాక‌రం
» టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అర‌వింద్ కుమార్ గౌడ్

హైదరాబాద్, డిసెంబ‌ర్ 28, అద్దం న్యూస్ :  ఎన్‌టిఆర్‌కు ద‌త్త‌పుత్రుడిగా పేరు తెచ్చుకున్న‌ సాయిబాబా మృతి చెంద‌డం బాధాక‌రమ‌ని టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అర‌వింద్ కుమార్ గౌడ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్‌ కన్వీనర్ పి.సాయిబాబా శ‌నివారం రాత్రి గుండెపోటుతే ఆకస్మిక మరణం పొందారు. ఆదివారం హైద‌రాబాద్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో సాయిబాబా సంతాప సభను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్ కుమార్ గౌడ్ హాజ‌రై సాయిబాబా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ …తెలుగుదేశం పార్టీలో సాయిబాబా ఒక కీలకమైన వ్యక్తి అని, తెలుగుదేశం పార్టీ స్థాపనకు పూర్వమే ఎన్‌టిఆర్‌ అభిమానులుగా ఉన్ననాటి నుండే ఎన్‌టిఆర్‌ అన్ని అభిమాన సంఘాలను ఒక సమైఖ్య‌గా చేసి తద్వారా ప్రజలకు చేరువయ్యే విధానాలతో ముందుకు నడిపి అన్న ఎన్‌టిఆర్ కు దత్తపుత్రిడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపన తొలి రోజుల్లో పార్టీ ప్రచార సభలు జరుగుతున్న సమయంలో పార్టీ అధ్యక్షులైన ఎన్‌టి.రామారావు పార్టీ గుర్తు కొరకు సైకిల్ గుర్తును ఎంపిక చేసారని.. దానికి సంబంధించిన పనులన్నింటిని సాయిబాబా పూర్తి చేసి తెచ్చారన్నారు. అదే విధంగా పార్టీ నినాదం మొదటిగా రాసి ఎన్‌టిఆర్‌ తో చెప్పించిన నినాదం “ తెలుగుదేశం పంతం అవినీతి పాలన అంతం ” అని. “ తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా “. అనే నినాద రూపకల్పనలో సాయిబాబా పాల్గొన్నారని తెలిపారు.

                    తెలుగుదేశం కార్యకర్తగా రాజకీయంగా ఆ రోజుల్లో నేషనల్ ఫ్రంట్ యూత్ ఫ్రంట్ కన్వీనర్‌గా రాంవిలాస్ పాశ్వాన్ ఉంటే నేషనల్ యూత్ ఫ్రంట్ కో– ఆర్డినేటర్ గా సాయిబాబా పనిచేసార‌న్నారు. వికలాంగుల సంక్షేమ సంస్థ కార్పొరేషన్ చైర్మన్‌గా రెండు పర్యాయాలు, లేపాక్షి హస్త కళల సంస్థ ఛైర్మ‌న్‌గా ఒకసారి, రాష్ట్ర గ్రంధాలయాల చైర్మెన్ ( స్టేట్ లైబ్రరీస్ చైర్మెన్ ) గా పనిచేసారన్నారు. పార్టీ కార్యక్రమాలను దూరదృష్టితో యువతలోకి బలంగా తీసుకెళ్లడంలో అద్భుత సామర్థ్యం కలవారన్నారు. తెలుగుదేశం ఉమ్మడి రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా అనేక పర్యాయాలు నిర్వహించారని పేర్కొన్నారు. పార్టీ ఎన్నికల సభలు, సమావేశాలు, బూత్ స్థాయిలోనూ పని చేశారని, పార్టీ సిద్ధాంతమైన ” బలహీన వర్గాల అభివృద్ధి ” కోసం ఆయన ఎప్పుడూ పాటుపడేవార‌న్నారు. సాయిబాబా ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్థూ… వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపాన్ని సానుభూతిని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర‌ నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, హైదరాబాద్ పార్లమెంట్‌ కన్వీనర్ నాగు నగేష్, ఎస్.ప్రకాష్, చంద్రమోహన్ గౌడ్, శ్యామ్ సుందర్, బాలాజీ గోస్వామి, సిహెచ్.విజయశ్రీ, భాను ప్రకాష్, సత్యనారాయణ, ఎండి. సలీం, టి.అనీల్, భవాని శ్రీనివాస్, బివై శ్రీకాంత్, జోగింధర్ సింగ్, బి.రాజు, రవి, ఆనంద్, సత్తన్న, జగదీష్ గౌడ్, శక్తిప్రేమ్, సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.

నేడు టిడిపి జిల్లా కార్యాల‌యానికి సాయిబాబా పార్థీవ దేహం :

అకాల మ‌ర‌ణం చెందిన టిడిపి సీనియ‌ర్ నాయ‌కుడు సాయిబాబా పార్థీవ దేహాన్ని సోమ‌వారం ఉద‌యం దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యానికి అభిమానుల సంద‌ర్శ‌నార్థం కోసం తీసుకురానున్నారు. నివాళి త‌ర్వాత అంబ‌ర్‌పేట‌లోని స్మ‌శాన వాటిక‌కు త‌ర‌లిస్తారని నేత‌లు తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.