Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADవెస్ట్‌బెంగాల్‌, అస్సాం, పుదుచ్చేరిలో కాషాయ జెండా రెప‌రెప‌లు — హైద‌రాబాద్‌లో సంబరాలు

వెస్ట్‌బెంగాల్‌, అస్సాం, పుదుచ్చేరిలో కాషాయ జెండా రెప‌రెప‌లు — హైద‌రాబాద్‌లో సంబరాలు

📰 Generate e-Paper Clip

వెస్ట్‌బెంగాల్‌, అస్సాం, పుదుచ్చేరిలో కాషాయ జెండా రెప‌రెప‌లు
» హైద‌రాబాద్‌లో సంబరాలు

హైదరాబాద్, మే 4, ( అద్దం న్యూస్ ) :  భారత రాజకీయ చరిత్రలో ఇది సరికొత్త సంచలనం. మోదీ నాయకత్వంలో బెంగాల్‌లో బిజెపి జయభేరి మోగించి, అస్సాం, పుదుచ్చేరిలో కాషాయ జెండా ఎగురవేసింది. ఈ నేప‌ధ్యంలో హైద‌రాబాద్‌లో సోమ‌వారం బిజెపి కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు జ‌రుపుకున్నారు. ఇందులో భాగంగా హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ అశోక్‌న‌గ‌ర్‌లో జ‌రిగిన సంబ‌రాల‌కు రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ట‌పాసులు కాల్చి, స్వీట్లు తినిపించారు.ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి.భరత్ గౌడ్, బిజెపి సికింద్రబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, స్థానికులు స్వామి రావు,రాజేష్, నాయకులు సురేష్ రాజు, ఆనంద్ రావు, జ్ఞానేశ్వర్, అరుణ్ కుమార్, ప్రశాంత్, శ్రవణ్, శక్తీసింగ్, లడ్డు, బిజెపి, బిజెవైఎం నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page