సాయి ఈశ్వర చారి కుటుంబాన్ని ఆదుకోవాలి
– డెవలప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో–కన్వీనర్ కాటమోని వెంకటేష్
హైదరాబాద్, డిసెంబర్ 7, అద్దం న్యూస్ : బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర చారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డెవలప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో–కన్వీనర్ కాటమోని వెంకటేష్ లు కోరారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… సాయి ఈశ్వరి చారి కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే 25 లక్షలు రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లుతో పాటు కుటుంబసభ్యుల్లో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. బిసి వర్గాలు 42 రిజర్వేషన్ కోసం అందరు కలిసి గట్టిగా పోరాడుదామని, అలాగే ఇలాంటి ఆత్మహత్యలు సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.![]()

![]()
