తెలుగు సాంప్రదాయాలకు ప్రతిరూపం సంక్రాంతి పండుగ – బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

తెలుగు సాంప్రదాయాలకు ప్రతిరూపం సంక్రాంతి పండుగ
– బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

హైదరాబాద్, జ‌న‌వ‌రి 13, అద్దం న్యూస్ :   అచ్చ తెలుగు సాంప్ర‌దాయాల‌కు ప్ర‌తిరూపం సంక్రాంతి పండుగ‌ని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ అన్నారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అశోక్‌న‌గ‌ర్‌లోని శ్రీ స‌త్య‌నారాయ‌ణ స్వామి దేవాల‌యం ప్రాంగణంలో కార్పొరేట‌ర్ పావ‌ని ఆధ్వ‌ర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా బిజెపి మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు భ‌ర‌త్‌గౌడ్‌, బిజెపి రాష్ట్ర కార్య‌ద‌ర్శి బండారు విజ‌య‌ల‌క్ష్మీ, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, ఉపాధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా మ‌హిళ‌లు వేసిన ముగ్గుల‌ను వారు ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ… తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, సంక్రాంతి పండుగ ప్రత్యేకతలు ఉట్టి పడేలా మహిళలు ముగ్గులను వేశారన్నారు. ఈ ముగ్గుల పోటీలో మొదటి బహుమతిగా రూ.3000/- నగదును సబర్మతి నగర్ బస్తీ నివాసి లోకేశ్వరి, 2 వ బహుమతి రూ. 2000/- నగదును చిక్కడపల్లి నుండి అనుషా, 3 వ బహుమతి రూ.1000/- నగదును అశోక్ నగర్ వాసి దుర్గా ద‌క్కించుకున్నారు. వారితో పాటు పోటీల్లో పాల్గొన్న అందరికీ కన్సలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా మోర్చ నాయకులు లక్ష్మి, మంగమ్మ, సంయుక్త రాణి, పూర్ణ, అనుష, డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆనంద్ రావు, బిజెపి సీనియర్ నాయకులు రఘు, మహేష్, కిరణ్, శ్రీకాంత్, సత్తి రెడ్డి, సాయి కుమార్, జ్ఞానేశ్వర్, రఘు యాదవ్, శేషి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page