బహుహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్   – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు సాయిబాబా

బహుహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

హైదరాబాద్, ఆగ‌స్టు 18, అద్దం న్యూస్ :   తెలంగాణ బహుహీన వర్గాల ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక అని, సబ్బండవర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం సర్వాయి పాపన్న కృషి చేసారని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. సోమ‌వారం హైద‌రాబాద్‌ దోమ‌ల‌గూడలోని టిడిపి జిల్లా పార్టీ కార్యాయంలో సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా హాజ‌రై పాప‌న్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా సాయిబాబా మాట్లాడుతూ… బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కాలని సమసమాజ స్ఫూర్తితో ఆనాడే పాపన్నగౌడ్ పోరాడడం గొప్ప విషయమ‌న్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జనగామ జిల్లా ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించి ఆనాడు పేదల పట్ల నిజాం రాజు అనుసరిస్తున్న నియంత వైఖరిని నిరసిస్తూ, పేదల కష్టాలను చూసి చెల్లించి తనే ఒక సైనికుడిగా రూపొంది తన మిత్రులు 12 మందితో కలిసి గోల్కొండ రాజ్యాన్ని జయించారన్నారు. మొట్ట మొదటిసారిగా తెలంగాణలోనే కాకుండా దేశంలోనే బడుగు బలహీన వర్గాల రాజ్యాన్ని స్థాపించిన ఘనత సర్వాయి పాపన్నకే దక్కుతుందన్నారు. అటువంటి మహానాయకుడి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే తరాలకు అందించి, ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేసారు. ఆయన తెలంగాణ రాబిన్ హుడ్ లాగా పది మంది సంపన్నులను దోచి 100 మంది పేదలకు అన్నం పెట్టే లక్ష్యంతో పని చేసి, ఆయన మరణించే నాటికి 12 వేలకు పైగా సైన్యాన్ని తయారు చేసారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన విజ్ఞప్తుల వల్ల ఈరోజు ట్యాంక్‌ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం నెలకొల్పాలని ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసారు.

                          ఈనాడు అన్ని పార్టీలు కాంగ్రెస్, బిఆర్ఎస్ లు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల బీసీల రాగం ఎత్తుకుంటున్నారు… కానీ ఆనాడే బీసీలకు సమన్యాయం, సమున్నత స్థానం కల్పించాలనే లక్ష్యంతో పాప‌న్న గౌడ్‌ పని చేసారన్నారు. ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా చేసుకుని పోరాడితే కానీ బీసీలకు న్యాయం చేయలేరనన్నారు. ఈ విధంగానైనా బీసీలకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్, ఎస్.ప్రకాష్, ఎన్.జగదీష్ గౌడ్, చంద్ర మోహన్ గౌడ్, కిరణ్, వెంకటేష్ చౌదరి, ప్రదీప్ గౌడ్, శంకర్ గౌడ్, సుక్రవేది, సత్తన్న రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page