ఎస్‌బిఐ పెన్షనర్స్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం
» ఆలిండియా ఎస్‌బిఐ పెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాధాకృష్ణన్, హైదరాబాద్ సర్కిల్ ప్రధాన కార్యదర్శి డి.కృష్ణకుమార్
హైదరాబాద్, జనవరి 2, అద్దం న్యూస్ : ఎస్‌బిఐ పెన్షనర్స్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని ఆలిండియా ఎస్‌బిఐ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాధాకృష్ణన్, ఎస్‌బిఐ పెన్షనర్స్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ ప్రధాన కార్యదర్శి డి.కృష్ణకుమార్ లు తెలిపారు. ఎస్‌బిఐ పెన్షనర్స్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ 42వ ఫార్మేషన్ డే ఉత్సవాలు, సీనియర్ సభ్యులకు సన్మాన కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలిండియా ఎస్‌బిఐ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాధాకృష్ణన్, ఎస్‌బిఐ పెన్షనర్స్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ ప్రధాన కార్యదర్శి డి.కృష్ణకుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా 90 ఏళ్ల వయస్సు దాటిన వారికి, బ్యాంకు వైద్యులను, 75 వయస్సు దాటిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎస్‌బిఐ పెన్షనర్స్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ తల్లిదండ్రుల మాదిరిగా ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేసే పాత్రను పోషిస్తోందన్నారు. పెన్సనర్ల ప్రతి వినతిని అత్యున్నత ప్రాధాన్యతతో పరిశీలించి పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. హైదరాబాద్ సర్కిల్‌లో పింఛనుదారుల నుంచి వచ్చే ఏ ప్రశ్న గానీ, ఏ వినతి గానీ పెండింగ్‌లో ఉండకూడదన్నదే మా ప్రధాన లక్ష్యం అని అన్నారు. పింఛనుదారుల ప్రయోజనాల కోసం సాధ్యమైన ప్రతిదీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తోందన్నారు.
నెట్‌వర్క్ వన్ జనరల్ మేనేజర్ రవి కుమార్ వర్మ మాట్లాడుతూ… పింఛనుదారులు మా బ్యాంక్‌కు, ఎస్‌బీఐ కుటుంబానికి భాగస్వాములన్నారు. పింఛనుదారుల నుంచి వచ్చే ప్రతి ప్రశ్న, మీరు ఏ ఇతర సంఘానికి చెందిన వారైనా సరే, చివరికి నచ్చినా నచ్చకపోయినా ఈ సంఘంలోకి రావాల్సిందే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బిఐ పెన్సనర్స్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ హెడ్ క్వాటర్స్ కృష్ణంరాజు, నెట్‌వర్క్ వన్ జనరల్ మేనేజర్ సతీష్, డిజిఎం సీడివో హైదరాబాద్ లోకల్ హెడ్ ఆఫీస్ ప్రియదర్శి పంకజ్, ఆఫీసర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు హట్కర్ శంకర్, ప్రధాన కార్యదర్శి కె.ఆంజనేయ ప్రసాద్, ఎస్‌బిఐ స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి శాండిల్య, సేవా ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి సూర్యం, ఎస్సీఎస్టీ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి భార్గవ కుమార్, ఓబిసి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొమిరిశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు.














Leave a Reply