Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadబీజేపీ సీనియర్ నాయకుడు ఆకుల సురేందర్ మృతి

బీజేపీ సీనియర్ నాయకుడు ఆకుల సురేందర్ మృతి

📰 Generate e-Paper Clip

  బీజేపీ సీనియర్ నాయకుడు ఆకుల సురేందర్ మృతి

హైదరాబాద్, ఆగ‌స్టు 28, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ సీనియర్ నాయకుడు ఆకుల సురేందర్ మృతి చెందారు. దీంతో డివిజ‌న్‌లోని జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. స్వల్ప అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా బాధపడుతూ గురువారం తెల్లవారుజామున హఠాన్మరణం చెందారు. ఆయనకు భార్య, ఒక కొడుకు ఉన్నారు. విషయం తెలుసుకున్న హర్యాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సురేందర్ కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడి తన సంతాపం వ్యక్తం చేశారు. బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు ముఠా జైసింహా త‌దిత‌రులు సురేందర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం జవహర్‌న‌గ‌ర్ నుండి బన్సిలాల్‌పేట‌ హిందూ శ్మశాన వాటిక వరకు సాగిన అంతిమ యాత్ర కొన‌సాగింది. అందరినీ ఆత్మీయంగా పలకరించే నాయకుడు, బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఆకుల సురేందర్ మరణం పార్టీకి తీరని లోటని, డివిజన్ బీజేపీలో ఒక సీనియర్ నాయకుడిని కోల్పోయిందని ఎ.వినయ్ కుమార్ అన్నారు. వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియల్లో బీజేపీ డివిజన్ అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్‌, ఆనంద్‌రావు, సీనియర్ నాయకులు టీ.గోపాల్, సాయి, శ్రీకాంత్, దామోదర్, పి.నర్సింగ్ రావు, ఉమేష్, బాలకృష్ణ, శివ కుమార్, సాయి కుమార్, డి.సత్యం, శేషాంక్, ప్రశాంత్, కాంగ్రెస్ నేతలు మారిశెట్టి నర్సింగ్ రావు, రాకేష్, శ్రీకాంత్, అశోక్ కుమార్, బాబ్జీ, జగదీష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page