బాల‌, బాలిక‌ల‌కు సేవ‌లు చేయ‌డం అభినంద‌నీయం – క‌వాడిగూడ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ర‌చ‌న శ్రీ

హైద‌రాబాద్‌, మే 31, అద్దం న్యూస్ :        బాల‌, బాలిక‌ల‌కు అప్స, స‌ర్వ్ నీడి లాంటి స్వ‌చ్ఛంద సంస్థ‌లు సేవ‌లు చేయ‌డం అభినంద‌నీయమ‌ని క‌వాడిగూడ డివిజ‌న్ కార్పొరేట‌ర్ జి.ర‌చ‌న శ్రీ అన్నారు. అప్స స్వ‌చ్ఛంద సంస్థ ఆధ్వ‌ర్యంలో క‌వాడిగూడ డివిజ‌న్ బండాన‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్‌లో వేస‌వి శిక్ష‌ణ శిబిరాల ముగింపు కార్య‌క్ర‌మం శ‌నివారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా కార్పొరేట‌ర్ ర‌చ‌న శ్రీ హాజ‌రై వేస‌వి శిక్ష‌ణ శిబిరాల్లో విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను అంద‌చేశారు. ఈ సంద‌ర్బంగా కార్పొరేట‌ర్ ర‌చ‌న శ్రీ మాట్లాడుతూ… అప్స‌, స‌ర్వ్ నీడి స్వ‌చ్ఛంద సంస్థ‌లు పేద‌ల మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి సేవ‌లు చేయ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. బాల‌, బాలిక‌ల‌కు చెడు వ్య‌వ‌స‌నాల‌కు దూరంగా ఉండాల‌ని, మొబైల్ పోన్ల‌కు బానిస కావొద్ద‌న్నారు. అనంతరం సర్వ్ నీడీ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ గౌతం మాట్లాడుతూ.. మా సంస్థ ప్రతీ రోజు రెండు వేల మంది పేదలకు ఉచితంగా భోజనం అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా దహన సంస్కారాలు కూడా ఉచిత చేస్తామని అన్నారు. హిమాయ‌త్‌న‌గ‌ర్ స‌బ్ పోస్ట్ మాస్ట‌ర్ సురేష్ గౌడ్ మాట్లాడుతూ… అప్స, స‌ర్వ్ నీడి స్వ‌చ్ఛంద సంస్థ లు వివిధ దాత‌ల ద్వారా పేద‌ల‌ను ఆదుకునేందుకు ముందుకు రావ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ పోస్టల్ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. అప్స స్వచ్ఛంద సంస్థ సీనియర్ కో– ఆర్డినేటర్ బొట్టు రమేష్ మాట్లాడుతూ.. ఈ వేసవి శిక్షణ శిబిరాలు బాల, బాలికలలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే దోహ‌దం చేస్తాయ‌న్నారు. ఈ క్రమంలో అప్స స్వచ్ఛంద సంస్థ ప్రతి నిధులు శ్రావణి, లావణ్య, మంగ, బీజేపీ నాయకులు వెంకటేష్, కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page