Saturday, September 19, 2026
No menu items!
Homedevotionalశ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యం ఆవ‌ర‌ణ‌లో షెడ్డు నిర్మాణ ప‌నులు ప్రారంభం

శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యం ఆవ‌ర‌ణ‌లో షెడ్డు నిర్మాణ ప‌నులు ప్రారంభం

📰 Generate e-Paper Clip

శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యం ఆవ‌ర‌ణ‌లో 

షెడ్డు నిర్మాణ ప‌నులు ప్రారంభం

హైదరాబాద్, జులై 30, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వ‌ద్ద గ‌ల శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యం ఆవర‌ణ‌లో నూత‌నంగా షెడ్డు నిర్మాణ ప‌నుల‌కు బుధ‌వారం భూమి పూజ జ‌రిగింది. దేవాలయం పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ మారిశెట్టి నర్సింగ్ రావు, కార్యనిర్వాణా అధికారి పీ లక్ష్మారెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ పూజ‌కు ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, మాజీ ఎంపి అంజ‌న్ కుమార్, స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అర్చ‌కుల‌ వేద మంత్రాల ద్వారా భూమి పూజ‌ను చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ, దేవాలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు శివకుమార్ జె.శివకుమార్, ఎం.రాజేష్, సాయి కీర్తి, భానుచందర్, గజానంద్, భాగ్యలక్ష్మి, గుర్రం దినేష్, సురేష్ యాదవ్, బిజెపి డివిజ‌న్ అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్‌, ఆనంద్‌రావు, బిజెపి నాయ‌కులు శ్రీకాంత్‌, సాయి, విఎస్‌టి.రాజు, స‌త్తిరెడ్డి, ప్ర‌కాష్ యాద‌వ్‌, సురేష్‌, శ్రీనివాస్‌, అరుణ్‌కుమార్‌, జ్ఞానేశ్వ‌ర్‌, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ముఠా న‌రేష్‌, పున్న స‌త్య‌నారాయ‌ణ‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు శీలం స‌త్య‌నారాయ‌ణ‌, జ‌యేంద‌ర్‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page