Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadరేవంత్ రెడ్డి సభలను అడ్డుకుంటాం – ఇచ్చిన హామీలు అమలు జరిగేంత వరకు నిరసన సెగలు...

రేవంత్ రెడ్డి సభలను అడ్డుకుంటాం – ఇచ్చిన హామీలు అమలు జరిగేంత వరకు నిరసన సెగలు తప్పవు – తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి చైర్మన్ సుల్తాన్ యాదగిరి

📰 Generate e-Paper Clip

బ‌షీర్‌బాగ్‌, జూన్ 3, అద్దం న్యూస్ :    తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కారులకు తీపి కబురు ప్రకటిస్తారని ఆశిస్తే, అది చేదుగా మారిందని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ( టియుజేఏసి ) చైర్మన్ సుల్తాన్ యాదగిరి ఆవేదన చెందారు. మంగ‌ళ‌వారం బ‌షీర్‌బాగ్ ప్రెస్ క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశం టియుజేఏసి సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ( టియుజేఏసి ) చైర్మన్ సుల్తాన్ యాదగిరి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని, గుర్తించాలని టీయుజేఏసీ ఎన్నోమార్లు వివిధ పోరాట రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుచేశామని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై రాష్ట్ర ఆవిర్భావం రోజూన స్పష్టమైన ప్రకటన చేస్తారని ఆశతో ఎదురు చూశామని తెలియజేశారు. ఉద్యమకారుల ఆశలు ఆశలుగానే మిగిలిపోయాయని ఆవేదనను వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమకారులను మోసగించినట్లుగానే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసగించిందని పేర్కొన్నారు. దీనికి తగిన మూల్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఉద్యమకారుల హక్కులను సాధించుకోవడానికి త్వరలోనే తమ కార్యచరణను ప్రకటిస్తామని అన్నారు. ఇంత వరకు తమ పోరాటం గాందేయ మార్గంలో కొనసాగిందని, ఇక మీదట మరో తెలంగాణ పోరాట సాధనకై ఆత్మబలిదానాలకైన సిద్దపడేలా తమ పోరాటాలను రాష్ట్ర ప్రభుత్వం చవిచూడాల్సి ఉంటుందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటలను టియు జేఏసి నమ్మె పరిస్థితుల్లో లేనందున, తొలి, మలి దశ ఉద్యమకారులను, వారి కుటుంబాలను సమీకరించి, కాంగ్రెసు ప్రభుత్వ ధమననీతిని ఎత్తిచూపేలా పల్లె నుండి హైదరాబాద్ వరకు మరో తెలంగాణ పోరాటాన్ని తలపిస్తామని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర నలుమూలల రెవంత్ రెడ్డి సభలు ఎక్కడ జరిగిన టియుజేఏసి అడ్డుకొని తీరుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే, ఎం.పి., స్థానిక ప్రజాప్రతినిధుల ఇళ్ళను చుట్టుముట్టే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని తెలియజేశారు. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం వలన తెలంగాణ ఉద్యమకారులు బావోద్వేగానికి గురై ఆత్మహత్యలకు పాల్పపడితే, దానికి నైతిక బాధ్య‌త‌ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ పాత్రికేయుల సమావేశంలో బత్తుల సోమయ్య, క్రిష్టాఫర్, బాకారం లావణ్య, కోతి మాధవరెడ్డి, సుచరిత, అంజలి, సునీత, సుజీ, వెంకటలక్ష్మి, అరుణ, ఎం.శంకర్ రావు తదితర తెలంగాణ ఉద్యమ మహిళా, కళాకారుల జేఏసీ నాయకులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page