70 శాతం రెవెన్యూ భాగ్యనగరం నుంచే
హైదరాబాద్ విశ్వనగరం, ప్రపంచదృష్టిని ఆకర్షిస్తుంది
ఇక్కడి సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలి
కార్పొరేటర్లకు నిధులు కేటాయించరా ?
వెంటనే సీఎం రేవంత్ నిధులు కేటాయించాలి

కవాడిగూడలో మంచినీటి పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ రచన శ్రీ
హైదరాబాద్, మే 23, అద్దం న్యూస్ : హైదరాబాద్ విశ్వనగరం, ప్రపంచదృష్టిని ఆకర్షిస్తుందని, 70 శాతం రెవెన్యూ భాగ్యనగరం నుంచే వస్తుందని, అటువంటప్పుడు కార్పొరేటర్లకు నిధులు కేటాయించరా ? కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం వెంటనే సీఎం రేవంత్ నిధులు కేటాయించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లోని వివిగిరి నగర్, అరుంధతి నగర్, నింకిన్ గల్లి, టిఆర్‌టి క్వాటర్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో కోటి.27 లక్షల నిధులతో మంచినీటి, సివరేజి పైప్‌లైన్ పనులకు శంకుస్థాపనలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ లు హాజరై అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కవాడిగూడ వైస్రాయ్ హోటల్ చౌరస్తా వద్ద రూ.30 లక్షల నిధులతో మంచినీటి పైప్‌లైన్ పనులకు కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ జి.రచన శ్రీ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… భాగ్యనగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే, కార్పొరేటర్ లేనందున నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. కార్పొరేటర్లకూ సైతం నిధులు కేటాయించడం లేదన్నారు. దీంతో అభివృద్ధి పనుల్లో వేగం మందగిస్తుందని చెప్పారు. అందాల పోటీలతోనే నగరం అభివృద్ధి జరగదన్నారు. బస్తీల్లో, కాలనీల్లో, స్లమ్స్‌లో మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వీధి లైట్లు, ప్లే గ్రౌండ్‌లు, రోడ్ల మరమ్మత్తులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం వెంటనే సీఎం రేవంత్ రెడ్డి నిధులను పెద్ద ఎత్తున కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో వీధిలైట్లను ఒకటి, రెండు రోజుల్లోనే మార్చేవారని చెప్పారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ప్రపంచదృష్టిని ఆకర్షిస్తున్న నగర ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత జీహెచ్ ఎంసీ, వాటర్ వర్క్స్, రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కిషన్ రెడ్డి చెప్పారు.
నగరంలోని పలు కాలనీలు, బస్తీలు, వాడల్లోని మౌలిక సదుపాయాల కల్పనకు జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం శోచనీయమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీనగర్ డివిజన్ లో వీధిలైట్ల ఏర్పాటుకు నిధులు లేవని అధికారులు చేతులెత్తేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, ముషీరాబాద్ తహశిల్థార్ రాణా ప్రతాప్ సింగ్, డిఎంసి రామానుజ రెడ్డి, సివిల్ సప్లై ఏఎస్ఓ దీప్తి, వాటర్ వర్క్స్ జిఎం రామకృష్ణ, జిహెచ్ఎంసి డిఈ గీత, డిఈ సన్నీ, డిజీఎం కార్తీక్ రెడ్డి, మేనేజర్ కృష్ణమోహన్, బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భారత్ గౌడ్, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహా, మాజీ కార్పొరేటర్ రవిందర్, కవాడిగూడ బిజెపి నాయకులు జి.వెంకటేష్, సలంద్రి శ్రీనివాస్‌యాదవ్, పరిమల్‌కుమార్, మహేందర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీకాంత్, ఆకుల శ్రీనివాస్, పూన్నా సత్యనారాయణ, మీడియా ఇన్ఛార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, పాశం రవి, గడ్డమీద శీను, వెంకటేష్, దేవయ్య, సంతోష్, సుధాకర్, చందు, కుమారి, రవిశంకర్ గుప్తా, హనుమంతు, కవాడిగూడ, గాంధీనగర్ డివిజన్ల బిజెపి అధ్యక్షులు దిలీప్ యాదవ్, వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, విఎస్‌టి.రాజు, ఎం ఉమేష్, బాలకృష్ణ, ప్రకాష్ యాదవ్, సత్తి రెడ్డి, శివ కుమార్, సురేష్, సాయి కుమార్, ఆనంద్ రావు, సత్యం, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, సాయి తరుణ్, సాయి తేజ, విజయలక్ష్మి, సంయుక్త రాణి, బిజెపి నాయకులు ప్రభాకర్, పిఎన్.చారి, సురేష్ ముదిరాజ్, అనిల్, జమాల్‌పూర్ నందు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply