Saturday, September 19, 2026
No menu items!
HomeEducationఇంట‌ర్ ఫ‌లితాల్లో 468 మార్కులు సాధించిన సిరిగిరి హ‌రిణి

ఇంట‌ర్ ఫ‌లితాల్లో 468 మార్కులు సాధించిన సిరిగిరి హ‌రిణి

📰 Generate e-Paper Clip

ఇంట‌ర్ ఫ‌లితాల్లో 468 మార్కులు సాధించిన సిరిగిరి హ‌రిణి

హైదరాబాద్, ఏప్రిల్ 12, అద్దం న్యూస్ :  రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఇంటర్‌ ఫలితలను విడుదల చేశారు. ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. ఇందులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు 4,89,126 మంది, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులు 5,07,949 మంది ఉన్నారు. ఫస్ట్‌ ఇయర్‌లో 4,89,123, సెకండ్‌ ఇయర్‌లో 3,58,490 మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో భాగంగా హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు సిరిగిరి శ్యామ్ కూతురు సిరిగిరి హ‌రిణి డిడి కాల‌నీ శ్రీ చైత‌న్య కాలేజీలో ఇంట‌ర్ చ‌దువుతుంది. ఆదివారం విడుద‌లైన ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌ ఫ‌లితాల్లో సిరిగిరి హ‌రిణి 470 మార్కుల‌కు గాను 468 మార్కులు సాధించింది. ఈ సంద‌ర్భంగా త‌మ కూతురుకు స్వీట్లు తినిపించి అభినందించారు. ఈ సంద‌ర్భంగా సిరిగిరి శ్యామ్ మాట్లాడుతూ… త‌న కూతురు ఇంట‌ర్ ఫ‌లితాల్లో 470 మార్కుల‌కుగాను 468 మార్కులు సాధించ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page