Friday, September 18, 2026
HomeHyderabadకరాటేలో వరల్డ్ రికార్డ్ సాధించిన అక్కా చెల్లెళ్లు – వరల్డ్ రికార్ట్‌ను ఆప‌రేషన్ సిందూర్‌కు అంకితం

కరాటేలో వరల్డ్ రికార్డ్ సాధించిన అక్కా చెల్లెళ్లు – వరల్డ్ రికార్ట్‌ను ఆప‌రేషన్ సిందూర్‌కు అంకితం

సిటీ క‌ల్చ‌ర‌ల్‌, మే 25, అద్దం న్యూస్ :   కరాటేలో వరుసగా 6 వ సారి వరల్డ్ రికార్డ్ సాధించి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు అక్కా చెల్లెళ్లు ఇద్దరు. గాంధీనగర్ ప్రాంతానికి చెందిన జి.అమృతరెడ్డి, జి. ఘణ సంతోషిణి రెడ్డి ఆక్కా చెల్లెళ్లు ఇద్దరు చిన్నతనం నుంచే కరాటేలో శిక్షణ పొందుతూ ఇప్పటికే అనేక ఆవార్డులు అందుకుని, రికార్డులు సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కాచిగూడలోని జీవీఆర్ కరాటే అకాడమిలో నిర్వహించిన కార్యక్రమంలో అక్కా చెల్లెళ్లు ఇద్దరు సెల్ఫ్ డిఫెన్స్ లో 9 నిమిషాల 36 సెకండ్లలో 121 టెక్నిక్స్ ప్రదర్శించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు. 11 నిమిషాల్లో చేయాల్సిన టార్గెట్‌ను కేవలం 9:36 నిమిషాల్లో రికార్డ్‌ను పూర్తిచేసి అద్వితీయమైన ప్రతిభను ప్రదర్శించారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కో-ఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కో-ఆర్డినేటర్ లయన్ డాక్టర్ ఎం. విజయలక్ష్మి పాల్గొని రికార్డ్స్ సాధించిన అక్కా చెల్లెళ్లు ఇద్దరు అమృతరెడ్డి, ఘణ సంతోషిణి రెడ్డిలకు సర్టిఫికెట్స్, మోడల్స్ అందజేశారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు సంపాదించిన అక్కాచెల్లెళ్లు తమ విజయాన్ని ఆపరేషన్ సిందూర్కు అంకితం చేస్తున్నామని తెలిపారు. భారత సైన్యానికి, నరేంద్రమోదీ ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్, హిమాయత్‌న‌గ‌ర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్, నల్లకుంట కార్పొరేటర్ వై. అమృత, సోమాజిగూడ కార్పొరేటర్ సంగీత యాదవ్, మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక, సమాచార హక్కు మాజీ కమీషనర్ ఖలీల్ ఉద్దీన్, డాక్టర్ కృష్ణారెడ్డి, అకాడమి డైరెక్టర్ డాక్టర్ జిఎస్ గోపాల్ రెడ్డి తదితరులు అక్కా చెల్లెళ్లు ఇద్దరి అభినంధించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page