రాంనగర్ రామాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణం
హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్బంగా ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. ఈ కళ్యాణానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు జైసింహా, కొండా శ్రీధర్‌రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన స్వామి వారి కళ్యాణంలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ వి.ఆనంద్ ముదిరాజ్, ఆలయ ధర్మకర్తలు వి.గోవర్థన్‌రెడ్డి, జి.మీన, బి.రాంచందర్, జె.యాదగిరి, ఎన్.ప్రశాంత్, ఎక్స్ అఫిషియో మెంబర్ ఆరుట్ల వెంకటరమణాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply