హైదరాబాద్, ఏప్రిల్ 4 అద్దం న్యూస్ : రోడ్ల పై వర్షపు నీరు నిలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ఆర్టీసి క్రాస్ రోడ్ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, జవహర్‌నగర్ స్కూల్ మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ వర్షపు నీరు నిలువకుండా చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముంపు సమస్య రాకుండా చూస్తామన్నారు. జిహెచ్ఎంసి అధికారులు సైతం ముంపు సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, బిజెపి ఆనంద్ రావు, సాయి తరుణ్, స్థానికులు నర్సింగ్ రావు, పున్న సత్యనారాయణ, బాబ్జీ, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply