Friday, September 18, 2026
Homeculturalsముగిసిన వసంతోత్సవ వేడుకలు

ముగిసిన వసంతోత్సవ వేడుకలు

 

సిటీ కల్చరల్, అద్దం న్యూస్   ఉగాది పండుగను పురస్కరించుకొని సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ఆధ్వర్యంలో వారం రోజులపాటు కళ్యాణ్ హంపి థియేటర్ లో నిర్వహిస్తున్న వసంతోత్సవ వేడుకల ముగింపు ఉత్సవాలకు జాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకుడు సతీష్ కుమార్ పాల్గొని పాల్గొని సంస్థ అధ్యక్షురాలు పద్మ కళ్యాణి తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ అధ్యక్షురాలు పద్మ కళ్యాణి నిర్వహణలో వారం రోజుల పాటు వసంతోత్సవ వేడుకలను నిర్వహించి అంతరించిపోతున్న ప్రాచీన కళా రూపాలను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. సభకు ముందు స్వర వాహిని సంగీతాలయం సంగీత గురువు శ్రీవాణి శిష్యు బృందంచే సంగీత కచేరీతో పాటు నీలిమ రాజు (అమెరికా ) ప్రదర్శించిన కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ గురువు వెంపటి చిన్న సత్యం, హరి రామ శిష్యుడు మూర్తి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page