Friday, September 18, 2026
Homedevotionalకార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ ఆధ్వ‌ర్యంలో శ్రీ అయ్య‌ప్ప స్వామి మ‌హాప‌డి పూజ

కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ ఆధ్వ‌ర్యంలో శ్రీ అయ్య‌ప్ప స్వామి మ‌హాప‌డి పూజ

కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ ఆధ్వ‌ర్యంలో శ్రీ అయ్య‌ప్ప స్వామి మ‌హాప‌డి పూజ
» హాజరైన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు

హైదరాబాద్, డిసెంబ‌ర్ 30, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ ఆధ్వ‌ర్యంలో శ్రీ అయ్య‌ప్ప స్వామి మ‌హాప‌డి పూజ వైభవంగా జ‌రిగింది. శ్రీనివాస గ్రౌండ్స్ ( ఘంటసాల గ్రౌండ్స్) లో జ‌రిగిన ఈ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో స్వాములు, భక్తులు, ప్రముఖులు, ప్రజనిధులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. పూజ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి శరణు ఘోష మారుమ్రోగింది. ఈ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్య‌స‌భ స‌భ్యుడు, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్ట‌ర్‌.కె.లక్ష్మణ్, కాంగ్రెస్ మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి కృష్ణ యాదవ్, గౌలిపుర కార్పొరేటర్ అలె భాగ్యలక్ష్మి భాస్కర్, క‌వాడిగూడ డివిజ‌న్ కార్పొరేట‌ర్ జి.ర‌చ‌న శ్రీ, న‌ల్లకుంట కార్పొరేటర్ వై.అమృత తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అతిధులను బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ సన్మానించి అయ్యప్ప స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి.భరత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రమేష్, నాయకులు ముఠా జయ సింహ, పాశం అనిల్ కుమార్ యాదవ్, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నవీన్, ఆనంద్‌రావు, సీనియర్ నాయకులు రాజు, పీ.నర్సింగ్ రావు, ఎం.ఉమేష్, పాల శ్రీనివాస్, ప్రకాష్ యాదవ్, శ్రీనివాస్, సాయి కుమార్, అరుణ్ కుమార్, నీరజ్, భారత్ స్వామి, సుక్క యాదగిరి, నరసింహ, కుమార్ స్వామి, చిర్ర యాదగిరి, హన్మంతు, ప్రశాంత్, డేవిడ్, అభిషేక్, సంయుక్త రాణి, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page