Saturday, September 19, 2026
No menu items!
Homedevotionalఐక్యతను చాటిన శ్రీరామ నవమి ఉత్సవాలు – తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్...

ఐక్యతను చాటిన శ్రీరామ నవమి ఉత్సవాలు – తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం

📰 Generate e-Paper Clip

ఐక్యతను చాటిన శ్రీరామ నవమి ఉత్సవాలు
తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం

హైదరాబాద్, మార్చి 27, అద్దం న్యూస్ :   రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను చాటయని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. శ్రీరామ నవమి పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్‌మెట్‌ డివిజన్ అచ్యుత రెడ్డి మార్గ్, మజీద్ గల్లీ స్ట్రీట్ నెంబర్ 7 లో, ముషీరాబాద్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన శ్రీరామ నవమి కళ్యాణ వేదికలను సందర్శించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ… ఈ వేడుకలు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలందరూ కలిసి మెలసి ఐక్యతగా పాల్గొనడానికి వేదికలుగా నిలిచాయని అన్నారు.

      ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.నరసయ్య, బీసీ జన సమితి రాష్ట్ర కన్వీనర్ జస్వంత్ కుమార్, నగర ఉపాధ్యక్షుడు జయపాల్ రెడ్డి, టీఎస్ కార్యాలయం ఇంచార్జ్ హనుమంత్ రెడ్డి, నవ తెలంగాణ విద్యార్థి సంఘ అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్, అడిక్‌మెట్‌ డివిజన్ అధ్యక్షుడు కాకునూరి సుధాకర్, శ్రీరామ నవమి ఉత్సవ నిర్వాహకులు రోషం బాలు, రాజ మహేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, వెంకటరమణ, సత్యనారాయణ అక్కిరాజు భార్గవ్, చంద్రశేఖర్, జి.గోపినాథ్ యాదవ్, పెండ్యాల శ్రీనివాస్ యాదవ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page