ఘ‌నంగా శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వ‌క‌ర్మ భ‌గ‌వాన్ య‌జ్ఞ మ‌హోత్స‌వం వేడుక‌లు

ఘ‌నంగా శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వ‌క‌ర్మ భ‌గ‌వాన్ య‌జ్ఞ మ‌హోత్స‌వం వేడుక‌లు

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 17, అద్దం న్యూస్ :   శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వ‌క‌ర్మ భ‌గ‌వాన్ య‌జ్ఞ మ‌హోత్స‌వం వేడుక‌లు బుధ‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ బాగ్‌లింగంప‌ల్లి మ‌ద‌ర్ డైరీ పార్కులో ఘ‌నంగా జ‌రిగాయి. విశ్వ‌క‌ర్మ వాక‌ర్ మిత్రుల ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిజెపి రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్‌, తెలంగాణ సాహిత్య అకాడ‌మీ మాజీ ఛైర్మ‌న్ జూలూరు గౌరీశంక‌ర్‌, మాజీ బిసి క‌మిష‌న్ స‌భ్యుడు ఉపేంద‌ర్ చారి, కార్పొరేట‌ర్ ర‌వి, ధ‌ర్మ‌పీఠం అధ్య‌క్షుడు త్రిమూర్తుల గౌరీశంక‌ర్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పూజ‌ల్లో వారు పాల్గొన్నారు. విశ్వ‌క‌ర్మ వాక‌ర్ క‌మిటీ స‌భ్యులు బైరోజు ర‌వీంద‌ర్ చారి, సుధాక‌ర్ చారి, జ్ఞానా చారి, వివేక్ చారి, న‌ర్సింహా చారి, సిరికొండ భాస్క‌రా చారి ల ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ముఠా జైసింహా, ముచ్చ‌కుర్తి ప్ర‌భాక‌ర్‌, శంక‌ర్ ముదిరాజ్‌, బిజెపి నాయ‌కులు పిఎన్‌.చారి త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page