శాంతియుత వాతావరణంలో శ్రీ వీర హనుమాన్  విజయ యాత్రను నిర్వ‌హించాలి –  న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ సివి.ఆనంద్

శాంతియుత వాతావరణంలో శ్రీ వీర హనుమాన్  విజయ యాత్రను నిర్వ‌హించాలి
  ♦ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ సివి.ఆనంద్
హైదరాబాద్,  అద్దం న్యూస్  శాంతియుత వాతావరణంలో శ్రీ వీర హనుమాన్  విజయ యాత్రను నిర్వ‌హించాలని హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ సివి.ఆనంద్ అన్నారు. ఈ నెల 12వ తేదీన శ్రీ హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా జ‌రిగే శ్రీ వీర హనుమాన్  విజయ యాత్ర  ఏర్పాట్ల విషయమై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో, శ్రీ వీర హనుమాన్  విజయ యాత్ర నిర్వాహకులతో బుధ‌వారం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజి ఆడిటోరియంలో స‌మన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్ నగర పోలీసు అధికారులతో పాటు సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా సివి.ఆనంద్ మాట్లాడుతూ.. విజయ యాత్ర సందర్భంలో ఎవరైనా కొత్త వారు వచ్చి చేరితే, వారిపై దృష్టి సారించి, ముందు జాగ్రత్త చర్యగా వెంటనే సంబంధిత స్థానిక పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. ఊరేగింపు సమయంలో  నిర్వాహకులు సంయమనంతో  ట్రాఫిక్ జామ్ కాకుండా, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. నిర్వాహకులు విగ్రహాల ఎత్తులో ముందే జాగ్రత్త గా ఉండాలని సూచించారు. ఎవరైనా రైల్వే బ్రిజ్ కన్న ఎక్కువ ఎత్తు విగ్రహాలు పెట్టినచో వారిని వేరే మార్గము ద్వారా పంపాల్సి వస్తుందని… నిర్వాహ‌కులు పోలీసు వారితో సహకరించాలని కోరారు. ఊరేగింపులో డీజే సిస్టమ్‌లను ఉపయోగించకుండా ఉండటం వలన ప్రజల, భక్తుల ఆరోగ్యం పట్ల వారికి మేలు చేసినట్లు అవుతుందని తెలిపారు. సౌండ్ మిక్చర్ లేకుండా పెద్ద సౌండ్ బాక్సులను వినియోగించుకోవాలని సూచించారు. వాతావరణ శాఖ తెలిపిన సమాచార మేరకు శనివారం రోజు వర్ష సూచన ఉన్న నేప‌ధ్యంలో జిహెచ్ఎంసి, ట్రాఫిక్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.   నిర్వాహకులు రోప్ పార్టి సభ్యులకు ( వాలంటీర్లకు )  సరియైన శిక్షణ ఇచ్చి వారిని వినియోగించుకోవాలని తెలిపారు. వాలంటీర్లను ఎక్కువ సంఖ్యలో పెట్టుకోవాలన్నారు. నిర్దేశించిన రూట్‌లోనే వెళ్ళితే ఎలాంటి సమస్యలు రావని..చిన్న గల్లీలలో టస్కర్ వాహనాలు తిరగడానికి అనుకూలంగా ఉన్నాయో లేదో ఒక సారి ముందుగా నిర్వాహకులు చూసుకోవాలని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విజయ యాత్ర ముగిసిన తరువాత, తిరుగు ప్రయాణములో  వెళ్ళేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరము ఎంతైనా ఉందన్నారు. పోలీసు శాఖ ముందస్తు అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాల వినియోగం అనుమతించబడదని స్ప‌ష్టం చేశారు. హైదరాబాదు సిటీ కమిషనరేట్ పరిధిలో  సుమారు 150 శ్రీ వీర హనుమాన్  విజయ యాత్ర, సైబరాబాదు, రాచకొండ పరిధిలో నుండి 46 విజయ యాత్రలు తీస్తున్నారని.. ఇవ‌న్ని ప్రధాన శ్రీ వీర హనుమాన్  విజయ యాత్రలో కలిసి ముందుకు వెళతారని  అన్నారు. సోషల్ మీడియాలో పుకార్లను నమ్మ వద్దు, రెచ్చగొట్టే పోస్ట్‌లు, ఫేక్ మెసేజ్‌లు వాటిని వ్యాప్తి చేయవద్దని, శ్రీ వీర హనుమాన్  విజయ యాత్రకు హైదరాబాదు సిటీ పోలీసు తరపున 17000 మంది పోలీసులు, అదనంగా సాయుధ బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. City Police Commissioner, Director General of Police C.V. Anandఈ నెల 12వ తేదీన ఉదయం 8 గంటల నుండి హైదరాబాదు సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయము, ఐసిసిసి భ‌వ‌నం, బంజారిహిత్స్‌లోని జాయింట్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయ‌బ‌డుతుంద‌న్నారు. ఇందులో వివిధ శాఖల అధికారులు ఏ సమస్య వచ్చినా  మీకు తగు సలహాలు, సూచనలు ఇస్తారని, వారికి సంబంధించిన అధికారులు కూడా  మీకు అందుబాటులో ఉంటారన్నారు. స‌మావేశం అనంతరం  సివి ఆనంద్, ఇతర శాఖల అధికారులు, నిర్వాహకులతో కలిసి ప్రధాన విజయ యాత్ర ఊరేగింపు శ్రీ.రామ మందిరం గౌలిగూడ నుండి ప్రారంభమై నారాయణగూడా, ఆర్టీసి క్రాస్ చౌర‌స్తా,  అశోక్‌న‌గ‌ర్‌,  కవాడిగూడా,  బైబిల్ హౌస్ నుండి తాడ్‌బండ్ హనుమాన్ టెంపుల్  వరకు దాదాపు 12.2 కిలోమీటర్ల మార్గాన్ని పరిశీలించారు. హనుమాన్ విజయ యాత్ర మార్గం తనిఖీ సందర్బంగా గుర్తించిన సమస్యలను, వారి  శాఖలలో పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో  ఎల్ ఆండ్ ఓ అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్, హైద‌రాబాద్ ట్రాఫిక్‌ జాయింట్ సిపి  జోయల్ డెవిస్, జిహెచ్ఎంసి అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ రఘు ప్రసాద్, ఆర్టీసి అధికారి రాజ‌శేఖ‌ర్‌, ఆర్ అండి డి అధికారి మ‌నోహ‌ర్‌బాబు, వైద్య శాఖ డిఎంఓ వెంక‌ట్‌, విహెచ్‌పి రాష్ట్ర అధ్య‌క్షుడు న‌ర్సింహామూర్తి, బ‌జ‌రంగ్‌ద‌ల్ రాష్ట్ర క‌న్వీన‌ర్ శివ‌రాములు, విహెచ్‌పి రాష్ట్ర క‌న్వీన‌ర్ రాములు, హైద‌రాబాద్ విహెచ్‌పి అధ్య‌క్షుడు అఖిల్, హైద‌రాబాద్‌ స్పెష‌ల్ బ్రాంచ్ డిసిపి సాయి, రాచ‌కొండ స్పెష‌ల్ బ్రాంచ్ డిసిపి న‌ర్సింహారెడ్డి, హైద‌రాబాద్‌లోని జోన‌ల్ డిసిపిలు, అధికారులు పాల్గొన్నారు. 
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page