హైదరాబాద్, అద్దం న్యూస్ : బీసీలు ఉవ్వెత్తున ఉద్యమాలు చేసినప్పుడే రాజ్యాధికారం సాధించుకుంటాం అని పలువురు వక్తలు తెలిపారు. శుక్రవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బీసీల మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఆర్.కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి వి.హనుమంతరావు, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, జస్టీస్ ఈశ్వరయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్.వినయ్, బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణ, పుట్టం పురుషోత్తమ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… 75 సంవత్సరాలు గడిచిన ఈ దేశంలో బీసీల హక్కులు ఇంతవరకు సాధించుకోలేదని పాలకవర్గాలు ప్రతిపక్షాలు బీసీలను రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు తప్ప వారి స్థితిగతులను ఏమాత్రం మార్చడం లేదన్నారు. 2 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీసీల పరంగా అనేక హామీలు ఇచ్చింది అధికారంలోకి వచ్చినటువంటి మరొక క్షణమే చట్టబద్ధత తీసుకొస్తాం అన్న హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 42 శాతం బిసి బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టీ 9షెడ్యూల్‌లో అమలు పర్చాలన్నారు. బీసీలు ఉవ్వెత్తున ఉద్యమాలు చేసినప్పుడే రాజ్యాధికారం సాధించుకుంటామని అన్ని సంఘాల అభ్యర్థులు ఐక్యమైనప్పుడే బిసి బిల్లును న్యాయం జరుగుతుందని తెలిపారు. దేశంలో రాజ్యాధికారం దక్కించుకోవాల్సిన అన్ని అర్హతలు ఉన్నటువంటి బీసీలకు రాజ్యాధికారాన్ని దూరం చేసేటువంటి కుట్రలు నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. వాళ్లు ఇచ్చే వాళ్లు కాదు మనం ఇవ్వాల్సినటువంటి స్థానంలో ఉండాలని… వాళ్లు పుచ్చుకునే స్థానంలో ఉండాలన్నారు. పుచ్చుకోవలసినటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఇస్తుంటే మనం అడుక్కుంటూ 75 సంవత్సరాలు కాలం తర్వాత 42 శాతం రిజర్వేషన్ల కోసం లేదా ఇతరత్రా కాస్త ఉపశమనాల కోసం ధర్నాలు చేస్తే సమస్యలు పరిష్కారం కావు పిడికిలి బిగించి రాజ్యాధికారం పోరాడితేనే హక్కులను సాధించుకోగలమని తెలిపారు. పోరాటాల ద్వారా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అదే పోరాట ప్రతిభ చూపించి బీసీల హక్కులను 42 శాతం రిజర్వేషన్లు సాధించుకోవాలన్నారు. బీసీలు అగ్గి రాల్చినప్పడే అందరూ భయపడతారని.. బీసీలందరు సీఎంతో చర్చించి పార్లమెంట్‌లో బీసీ బిల్లుకై పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. తమిళనాడులో జయలలిత మాదిరిగా మనం కూడా చేయవలసిన సమయం వచ్చిందన్నారు. రాజ్యాంగ స్వరూపాన్ని మార్చి అయిన సరే మన రిజర్వేషన్లను సాధించుకోవాలన్నారు. రాహుల్ గాంధీ కూడా బీసీల వైపే ఉన్నారని.. బీసీ బిల్లుకు పార్లమెంట్ సభ్యులతో చర్చించి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో బీసీ నాయకులు గుజ్జ సత్యం. నిరుద్యోజేసీ చైర్మన్ నీలా వెంకటేష్, నందగోపాల్, కోళ్ల జనార్ధన్, పగిళ్ల సతీష్ ,మోడీ రాందేవ్, వంశీ ,తదితర నాయకులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply