Friday, September 18, 2026
HomeTelanganaహెచ్‌సియులో చెట్లు నరకడం ఆపండి – హైకోర్టు ఆదేశం

హెచ్‌సియులో చెట్లు నరకడం ఆపండి – హైకోర్టు ఆదేశం

తెలంగాణ బ్యూరో, ఏప్రిల్ 2, అద్దం న్యూస్ : హెచ్‌సియులో చెట్లు నరకడం ఆపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. హెచ్‌సియులోని 400 ఎకరాల భూమిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ వట ఫౌండేషన్ అనే స్వచ్చంధ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ మేరకు బుధవారం మధ్యాహ్నం తర్వాత హైకోర్టులో హెచ్‌సియు 400 ఎకరాల భూమి పై వాదోపవాదనులు జరిగాయి. హైకోర్టులో హెచ్‌సియు భూములపై ప్రభుత్వ తరపు లాయర్ వింతవాదనలు వినిపించారు. గూగుల్ ఫోటోలు చూపించి అక్కడ ఫారెస్ట్ ఉంది అంటున్నారు, అక్కడ ఫారెస్ట్ లేదని, నా స్నేహితుడిది మెంబర్‌గా ఉన్న ఒక గోల్ఫ్ క్లబ్‌లో కూడా నెమళ్ళు, జింకలు, పాములు ఉన్నాయి.. దానిని ఫారెస్ట్‌గా డిక్లేర్ చేస్తారా ?.. అది ఇండస్ట్రియల్ ల్యాండ్ అని ప్రభుత్వ తరపులాయరు వాదించారు. ఈ నేపధ్యంలో రేపటి వరకు ఎలాంటి చెట్లు నరకడం కానీ, ఎలాంటి పనులు గాని అక్కడ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ రేపటికి వాయిదా వేసింది

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page