హైదరాబాద్, ఏప్రిల్ 2 ( అద్దం న్యూస్ ) : హెచ్‌సియు కు చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నాలను సిపిఐ (ఎం) పార్టీ ఖండిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ హెచ్‌సియు వద్ద నిరసన వ్యక్తం చేస్తుండగా. సిపిఐ (ఎం) రాష్ట్ర నాయకులను అక్రమ అరెస్టులను చేయడని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ (ఎం) పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి అన్నారు. సిపిఐ (ఎం) పార్టీ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ (ఎం) పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను అమ్మటం ద్వారా ఆర్థిక వ్యవస్థను నడపాలని భావించడం తీవ్ర అభ్యంతరకరమని వెంటనే అటువంటి ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్‌సియు కొరకు కేటాయించబడిన భూములలో 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాలని చేస్తున్న ప్రయత్నాలను సిపిఐ (ఎం) పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని, ఆ ప్రయత్నాలను ప్రతిఘటిస్తామని, ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా వెంటనే సెంట్రల్ యూనివర్సిటీకి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. సిపిఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జె.వెంకటేష్ మాట్లాడుతూ.. హెచ్‌సియు భూములను కాపాడుకునేందుకు స్థానిక విద్యార్థి సంఘం వీరోచితంగా పోరాడుతున్నదన్నారు.
సిపిఐ ( ఎం ) గ్రేటర్ హైదరాబాద్ సెంటర్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి తలమానికంగా సెంట్రల్ యూనివర్సిటీ ఉందన్నారు. పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ 400 ఎకరాలలో భూమి చదును చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఖండించారు. ప్రభుత్వం వెంటనే ఆ భూమి నుండి వైదొలగాలని, పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలని లేనియెడల ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.అరుణ జ్యోతి, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు, ఎం.మహేందర్, కెఎన్.రాజన్న, ముషీరాబాద్ జోన్ కార్యదర్శి ఆర్.వెంకటేష్, కుమారస్వామి, జి.కిరణ్, జి.నరేష్, అశోక్, జావేద్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply