Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadవిద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి – ఎమ్మెల్సి సురభి వాణి దేవి

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి – ఎమ్మెల్సి సురభి వాణి దేవి

📰 Generate e-Paper Clip

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి
– ఎమ్మెల్సి సురభి వాణి దేవి

హనుమకొండ, డిసెంబ‌ర్ 3, అద్దం న్యూస్ :      వంగర గ్రామంలో నెలకొల్పిన డా.రంగారావు స్మారక బాలికల గురుకుల పాఠశాల మహోన్నతమైన ఆశయం‌ కొరకు నెలకొల్పిన విద్యా సంస్థ అని ” భారతరత్న” మాజీ‌ ప్రధాని స్వర్గీయ పి.వి. నరసింహారావు కూతురు ఎమ్మెల్సి వాణిదేవి తెలిపారు. వంగర పర్యటనలో భాగంగా డా.రంగారావు స్మారక ఆశ్రమ పాఠశాలను సందర్శించి పదోతరగతి ఇంటర్ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సి వాణిదేవి మాట్లాడుతూ… తల్లిదండ్రులకు దూరంగా చిన్ననాటి నుండే ఆశ్రమ విద్యను పొందే అవకాశం లభిస్తుందని ఈ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి వంగర పేరు నిలపాలని కోరారు. దేశంలో అనేక రంగాలలో మహిళలు స్వశక్తితో రాణిస్తున్నారని దీనకి ముఖ్య కారణంగా మహిళల్లో ఉండే ఆత్మవిశ్వాసం అని అభిప్రాయపడ్డారు. ఏ సమస్యనైనా ముందు స్నేహితుల చర్చించడం, తల్లిదండ్రులతో పాలుపంచుకోవటం, ఉపాధ్యాయుల సహాయంతో అధిగమించేందుకు చొరవ చూపాలని,చిన్న విషయాలకు ఒత్తిడికి గురికాకుండా ఉండాల‌ని కోరారు.
డా.పివి.రంగారావు తమకు ఎన్ని సమస్యలు ఉన్నా సమయోచిత బుద్దుని ప్రదర్శించి మహోన్నతమైన వ్యక్తులుగా నిలిచారాని.. ఆయ‌న‌ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. డా.రంగారావు గురుకులు పాఠశాలలలో ఇంటర్ స్థాయిలో అత్యధిక మార్కులు పొందిన బాలికలకు తమ యాజమాన్యంలోని‌ సురభి ఎడ్యుకేషనల్ సంస్థలో‌ ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, ఫార్మసి కళాశాలలో అవకాశం ఇస్తామని హామి ఇచ్చారు.

పివి‌ కుమారుడు, పివి.గ్లోబల్ పౌండేషన్ అధ్యక్షుడు పివి.ప్రభాకర్ రావు మాట్లాడుతూ… పేద ప్రజలకు ఉచిత విద్య అందాలనే సంకల్పంతో పివి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో సర్వేల్ ( నల్గొండ ) జిల్లాలో మొట్టమొదటి ఆశ్రమ పాఠశాల ప్రారంభించారని… తద్వార అనేక పాఠశాలల ఏర్పాటుకు అవకాశం ఏర్పడం ద్వారా నాటి తరం నుండి‌ నేటికి అనేక మంది ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు రాష్ట్రంలో కాక దేశంలో వివిధ హోదాల్లో స్థిరపడ్డారని గుర్తు చేశారు. వంగర ఆశ్రమ పాఠశాలకు తమ సోదరులు రంగా రావు పాఠశాల ఏర్పాటు మొదలుకొ శాశ్వత భవనాల నిర్మాణం కొరకు సొంత‌ భూమిని‌ అందచేసిన ఘనత డా.పివి.రంగారావుదే అనే సంగతి గుర్తు చేశారు. సుదీర్ఘ చరిత్ర గల వంగర ఆశ్రమ పాఠశాల పేరును నిలిపేదిశగా విద్యార్థులు చొరవ చూపాలని, మానసిక ఒత్తిడి జయించడానకి ధ్యానం ముఖ్యమైన మార్గం దాన్ని ఆచరణలోని తీసుకోవాలని కోరారు. ఆశ్రమ పాఠశాలలో సమస్యలపై యాజమాన్యం విన్నపం చేయగా వాటి పరిష్కారం కొరకు చొరచూపేందుకు పి.వి.ప్రభాకర్ రావు హామి ఇచ్చారు. తక్షణ అవసరాలకు గాను సైన్స్ లాబ్ కు అవసరమయ్యే టేబుల్స్ అందించానికి పి.వి.ప్రభాకర్ హామియిచ్చారు.

పివి‌.మదన్ మోహన్ మాట్లాడుతూ… ఎన్ని సమస్యలున్నా ధైర్యం అనే ఆయుధంతో ముందుకు వెళ్లాలన్నారు. అధైర్యం వల్ల ఏ కార్యం‌ సాధించలేమని తెలిపారు. సమస్యలు ఇతరులతో పంచుకోవాల‌ని, దాని వల్ల ఒత్తిడికి దూరమవుతామని తెలిపారు. పివి.శరత్ బాబు మాట్లాడుతూ… వంగర గ్రామానికి మంచి చరిత్ర వుంది‌ దాన్ని కాపాడే దిశగా విద్యార్థులు కృషి చేయాలని‌ కోరారు. ప్రిన్సిపాల్ అప్రజ్ సుల్తానా మాట్లాడుతూ… తల్లిదండ్రులకు దూరంగా ఉండి యాజమాన్యంపై నమ్మకంతో పాఠశాలలో చదివే విద్యార్థులు అన్ని రంగాలలో ముందుండే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయురాలు భార్గవి, సిబ్బంది పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page