విద్యార్థులు ఇష్ట‌ప‌డి చ‌దివాలి – ఎమ్మెల్యే ముఠా గోపాల్

విద్యార్థులు ఇష్ట‌ప‌డి చ‌దివాలి
– ఎమ్మెల్యే ముఠా గోపాల్

హైదరాబాద్, మే 6, ( అద్దం న్యూస్ ) :    విద్యార్థులు బ‌ట్టిప‌ట్టి చ‌ద‌వ‌డం కంటే ఇష్ట‌ప‌డి చ‌దివాలని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్ రేడియంట్ హై స్కూల్ 62వ టాప‌ర్స్ డే కార్య‌క్ర‌మం ఆర్య‌వైశ్య హాస్ట‌ల్ సెమినార్ హాల్‌లో జ‌రిగింది. రేడియంట్ హై స్కూల్ క‌రస్పాండెంట్ స‌య్య‌ద్ అహ్మదుల్లా బ‌క్తియారి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్, గౌరవ అతిథులుగా బిఆర్ఎస్ పార్టీ యువ‌జ‌న నాయ‌కుడు ముఠా జైసింహా, పల్మోనాలజిస్ట్ డాక్ట‌ర్‌.వ‌సీమ్‌, జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్, డయాబాలజిస్ట్ డాక్ట‌ర్‌.స‌రోష్ అహ్మ‌ద్ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా రేడియంట్ హై స్కూల్ టాప‌ర్స్‌కు ఎమ్మెల్యే గోపాల్ చేతుల మీదుగా సిల్వ‌ర్ మెడ‌ల్స్, స‌ర్టిఫికెట్లను అంద‌చేశారు.

     ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ… ఈ రోజు మీరు క్లాస్ టాపర్స్‌గా వ‌చ్చార‌ని, రేపు మీరు డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్, సైంటిస్ట్ అయ్యి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల‌ని విద్యార్థుల‌కు సూచించారు. ” చిన్న లక్ష్యం – కలలు పెద్దవిగా ” ఉండాలన్న అన్న అబ్దుల్ కలాం ఆలోచ‌న‌లు, ఆద‌ర్శాల ప్ర‌కారం చ‌దువుకోవాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉపాధ్యాయులు ఇర్ఫానా, అంతుల్ మ‌తీన్‌, ఆస్రా ఫాతిమా, ఎం.మంజుశ్రీ, హ‌నీఫా అర్షి, స‌య్య‌ద్ ఖ‌లీల్‌, అన్వ‌ర్‌, ఎండి.మాజిద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page