Friday, September 18, 2026
HomeHyderabadనిరుపేదల వైద్య సేవలకు సహకారం ...

నిరుపేదల వైద్య సేవలకు సహకారం   – ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

నిరుపేదల వైద్య సేవలకు సహకారం

                – ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, ఆగ‌స్టు 08, అద్దం న్యూస్ :   సికింద్రాబాద్‌లోని మాణికేశ్వరి నగర్‌కు చెందిన కోడాది పర్నిక, ఏసీఎస్ నగర్‌కు చెందిన కె.సుధాకర్ లు అనారోగ్యంతో సతమతమవుతున్న దశలో సమాచారం అందుకున్న స్థానిక శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ వారి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి ( సీఎంఆర్ఎఫ్ ) నుంచి లెటర్ అఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) పత్రాలను సితాఫలమండీలోని ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అందించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త రాజ సుందర్, పరికిబండ మాజీ సర్పంచ్ అర్జున్, మనోహరాబాద్ ఎంపిటిసి వెంకటేష్ గౌడ్, శేఖర్ గౌడ్, స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ… నిరుపేదలకు నాణ్యమైన భారంగా మారిన దశలో వైద్య సేవలను పొందేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని అన్నారు. ప్రజలు అత్యవసర సందర్భాల్లో సితాఫలమండీలోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page