మోడీ ప్రభుత్వానికి ఏజెంటుగా ఈసీ – సీపీఐ ( ఎం ) నిరసన కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య

మోడీ ప్రభుత్వానికి ఏజెంటుగా ఈసీ

– సీపీఐ ( ఎం ) కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య


తెలంగాణ బ్యూరో, ఆగ‌స్టు 08, అద్దం న్యూస్ :  మోడీ ప్రభుత్వానికి ఏజెంటుగా ఎన్నికల కమిషన్ ( ఈసి ) పని చేస్తున్నదని సీపీఐ ( ఎం ) కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆ పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సదాను వ్యతిరేకిస్తూ కార్యక్రమాన్ని చేపట్టారు. గోల్కొండ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం జరిగిన నిరసన సభలో వీరయ్య మాట్లాడుతూ… బీహార్‌లో అక్రమంగా, అప్రజాస్వామికంగా 62 లక్షల ఓటర్లను రకరకాల పేరుతో తొలగించే ప్రక్రియకు ఈసీ ఒడిగట్టిందని విమర్శించారు. స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (సర్) పేరుతో ఒక్క నెలలోనే ఇన్ని ఓట్లను తొలగించిందని తెలిపారు. నిరుపేదలు, అసంఘటిత కార్మికులు, గ్రామీణ పేదలను ఓటర్ల లిస్టులో నుంచి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి ఓట్లు పడవని భావించిన ప్రతీ చోటా ఏదో ఒక పేరుతో వాళ్ల ఓట్లను తొలగించే కుట్రకు పాల్పడుతున్నదని విమర్శించారు. ఇది ఆప్రజాస్వామిక చర్య అనీ, అందుకే సీపీఐ ( ఎం ) దీన్ని వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు. దేశంలో ప్రతి పక్ష పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు. అయినా మోడీ ప్రభుత్వానికి ఏజెంటుగా వ్యవహరిస్తూ ఊడిగం చేస్తున్న ఈసీ ఉలుకూ పలుకు లేకుండా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఇదోక కుట్ర పూరితమైన ప్రక్రియ అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉండాల్చిన మోడీ ప్రధాన మంత్రి స్థానంలో ఉన్నారనే విషయాన్ని అనేక ఆధారాలు బట్టబయలు చేస్తున్నాయని వివరించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈసీ బీజేపీకి తొత్తుగా మారటం వల్ల, మోడీకి ఏజెంటుగా వ్యవహరించటం వల్ల ఐదు కోట్ల ఓట్లు పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు అదనంగా ఉన్నాయని తెలిపారు. ఇది ఎన్నికల కమిషన్ ప్రకటించిన లెక్కేనని గుర్తు చేశారు. పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎలా ఎక్కువగా ఉంటాయో.. ఈసీ సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నదని విమర్శించారు. ఐదు కోట్ల ఓట్లు అదనంగా లెక్కించిన ఫలితంగా బీజేపీకి 70 సీట్లు తోడయ్యాయని తెలిపాడు. ఆదనపు ఓట్లు ఎక్కడ పోలయ్యాయో అక్కడ బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు. ఓటింగ్ ముగిసే సమయానికి ప్రకటించిన పోలైన ఓట్ల సంఖ్యకు తుది సంఖ్యకు చాలా తేడా ఉందని చెప్పారు.                           దేశ చరిత్రలో 1.2 శాతం మించి తేడా లేదని తెలిపారు. కానీ ఈసీ మోడీ జేబు సంస్థగా మారిన తర్వాత పది శాతం వరకు తేడా వచ్చిందని గుర్తు చేశారు. 24 గంటల్లో తేల్పాల్సిన పోలింగ్ లెక్కలకు పది రోజుల సమయం తీసుకుంటున్న నియోజక వర్గాలు, రాష్ట్రాలున్నాయని వివరించారు. ఈ విషయం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యాణా, యూపి లో రుజువైందని గుర్తు చేశారు. మహారాష్ట్రలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య ఐదు మాసాల్లో కోటి ఓట్లు పెరిగాయని చెప్పారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన తంతంగాన్ని వెల్లడించాలని, సీసీ పుటేజీలను బైటపెట్టాలని ప్రతిపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేసినా పట్టించుకోవటంలేదని తెలిపారు. బీజేపీ అనుసరిస్తున్న పద్దతులను పరిశీలిస్తే దేశంలో ఒక భయానక పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని కేవలం బీహారు సంబంధించిన విషయంగానే చూడొద్దని సూచించారు. రానున్న కాలం గడ్డు కాలంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. సీపీఐ ( ఎం ) రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం.వెంకటేశ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన రావు, భాస్కర్, బండారు రవికుమార్, రాష్ట్రకమిటీ సభ్యులు ఎంవి.రమణ, పి.ఆశయ్య, భూపాల్, బాబూరావు, నగర నాయకులు ఎం.శ్రీనివాస్, ఎం. శ్రీనివాస్ రావు, మహేందర్, ఎం.దశరథ్, ఆర్.వెంకటేశ్, రంగారెడ్డి జిల్లా నాయకులు చంద్రమోహన్, కవిత, జగదీశ్ తదితరులు పాల్గన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page