భక్తి శ్రద్ధలతో హంసవాహన సేవ

హైదరాబాద్, మే 14, అద్దం న్యూస్ : ఈ నెల 12న ప్రారంభమై 20వ తేదీ వరకు కొనసాగుతున్న ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయంలో విశేష పూజలు జరిగాయి. ఇందులో భాగంగా పుణ్యాహవాచనము, బిందెతీర్థము, హవనము, బలిహరణము, బాలభోగము, మంత్రపుష్పం, వేదపారాయణం, మహానివేదన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వంవపారంపర్య ధర్మకర్త జి.శ్రీనాథ్‌గౌడ్, కీర్తి, సువర్ణలత, ఆలయ కార్యనిర్వాహణాధికారిణి అన్నపూర్ణ, భక్తులు పాల్గొన్నారు.
భక్తి శ్రద్ధలతో హంసవాహన సేవ :
శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి వారి హంసవాహన సేవ జరిగింది. చిక్కడపల్లి శ్రీనివాసపురం తిరువీధుల గూండా వేదమంత్రోచ్ఛారణలతో, మంగళవాయిద్యాలతో అత్యంత వైభవంగా ఊరేగింపును నిర్వహించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
