Sunday, September 20, 2026
No menu items!
Homedevotionalభ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో హంస‌వాహ‌న సేవ

భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో హంస‌వాహ‌న సేవ

📰 Generate e-Paper Clip

 

 

భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో హంస‌వాహ‌న సేవ

 

 శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న దృశ్యం.
   శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న దృశ్యం.

హైదరాబాద్, మే 14, అద్దం న్యూస్ :    ఈ నెల 12న ప్రారంభ‌మై 20వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతున్న‌ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లిలోని శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా బుధ‌వారం ఆల‌యంలో విశేష పూజ‌లు జ‌రిగాయి. ఇందులో భాగంగా పుణ్యాహ‌వాచ‌న‌ము, బిందెతీర్థ‌ము, హ‌వ‌నము, బ‌లిహ‌ర‌ణ‌ము, బాల‌భోగ‌ము, మంత్ర‌పుష్పం, వేద‌పారాయ‌ణం, మ‌హానివేదన త‌దిత‌ర పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య వంవ‌పారంప‌ర్య ధ‌ర్మ‌క‌ర్త జి.శ్రీనాథ్‌గౌడ్‌, కీర్తి, సువ‌ర్ణ‌ల‌త‌, ఆల‌య కార్య‌నిర్వాహ‌ణాధికారిణి అన్న‌పూర్ణ‌, భ‌క్తులు పాల్గొన్నారు.

భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో హంస‌వాహ‌న సేవ :

శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా బుధ‌వారం రాత్రి స్వామి వారి హంస‌వాహ‌న సేవ జ‌రిగింది. చిక్క‌డ‌ప‌ల్లి శ్రీనివాస‌పురం తిరువీధుల గూండా వేద‌మంత్రోచ్ఛార‌ణ‌ల‌తో, మంగ‌ళ‌వాయిద్యాల‌తో అత్యంత వైభ‌వంగా ఊరేగింపును నిర్వ‌హించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page