ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లండి
• టీపీసీసీ అధికార ప్రతినిధి, వెయ్యి రోజుల ప్రజాపాలన కమిటీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు గౌరీ సతీష్
హైదరాబాద్, సెప్టెంబర్ 12, ( అద్దం న్యూస్ ) : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని టీపీసీసీ అధికార ప్రతినిధి, వెయ్యి రోజుల ప్రజాపాలన కమిటీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు గౌరీ సతీష్ అన్నారు. శనివారం హైదరాబాద్ అడిక్మెట్ డివిజన్ లలితానగర్ కమ్యూనిటీహాల్లో ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్ కుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరీ సతీష్ హాజరై మాట్లాడుతూ… బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. దళితుల పట్ల బీఆర్ఎస్కు గౌరవం లేదని, ఇందుకు స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలు, దళితులు నడిచిన రోడ్డును శుద్ది చేసిన ఘటనలే నిదర్శనమన్నారు. సర్ ప్రక్రియలో అర్హులైన ఓట్లు పోకుండా కార్యకర్తలు ఆప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు తప్పకుండా వస్తాయన్నారు. వెయ్యి రోజుల పాలనలో సీఎం రేవంత్రెడ్డి అమలు చేసిన ఆరు గ్యారెంటీలతో పాటు రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, రైతు భరోసా, రుణమాఫీ, ఉద్యోగ ఖాళీల భర్తీలు, మహిళా సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించి పార్టీ పట్ల ప్రజలను ఆకర్షితులను చేయాలని సూచించారు.
రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దీపక్ జాన్ మాట్లాడుతూ… ఎన్నికల కమిషన్ బీజేపీకి తొత్తుగా మారి క్రిస్టియన్ మైనారిటీ ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ… అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన వారికి కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ పటిష్టత కోసం డివిజన్ అధ్యక్షులు సమిష్టిగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆర్.కల్పనాయాదవ్, వాజీద్ హుస్సేన్, డివిజన్ల అధ్యక్షులు సంగపాక వెంకట్, కిరణ్, భాస్కర్, రమేష్ యాదవ్, నరేందర్, నగర నాయకులు సుధేష్, విజయ్ కుమార్, ఆనంద్, కవిత, అభిషేక్, గోవింద్, వరదరాజు, నవీన్, లింగంగుప్తా తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply