బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, అవకాశాలు కల్పించింది టిడిపి యే – తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అర‌వింద్ కుమార్‌

బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, అవకాశాలు కల్పించింది టిడిపి యే

– తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అర‌వింద్ కుమార్‌

హైదరాబాద్, అక్టోబ‌ర్ 18, అద్దం న్యూస్ :       బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, అవకాశాలు కల్పించి చైతన్య పరిచింది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని ఈ పార్టీ తెలంగాణ రాష్ట్ర పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అర‌వింద్ కుమార్‌ అన్నారు. బిసి సంఘాల ఐక్య వేదిక పిలుపుమేర‌కు శ‌నివారం నిర్వ‌హించిన బంద్ కార్యక్రమానికి టిడిపి మ‌ద్ద‌తుగా క‌వాడిగూడ ఇందిరాపార్క్ రోడ్డు మార్గంలో ఆందోళ‌న జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అర‌వింద్ కుమార్‌, టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా లు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… తెలుగుదేశం హయాంలోనే బీసీలకు స్వర్ణయుగమని అన్నారు. 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి, 1983 లో అధికారంలోకి వచ్చిన తరువాతనే పేద, బడుగు, బలహీన వర్గాలకు పెద్దఎత్తున అవకాశాలు కల్పించారన్నారు. రాజకీయ అవకాశాలు లభించని ఎందరో పేదలకు, బడుగు బలహీన వర్గాలకు పార్టీ టికెట్లు ఇచ్చి తరతరాలుగా అన్యాయం జరిగిన బీసీలకు రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు అందించారని తెలిపారు. విద్యా, సామాజిక రంగాలలో 1986లో బిసిల అభ్యున్నతి కోసం మురళీధర్ రావు కమీషన్ ఏర్పాటు చేసారని, బీసీలకు మొట్టమొదటి సారిగా 1987 స్థానిక సంస్థల ఎన్నికలలో 20 శాతం రిజర్వేషన్లు కల్పించింది తెలుగుదేశమే అని అన్నారు.

బీసీల ఆర్థికాభ్యున్నతికి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు, 1951 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేయడానికి ‘కాకాకలేల్కర్’ కమిషన్ బీసీల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం చేసిన సూచనలు, సిఫారసులు కాంగ్రెస్ వాటిని అమలు చేయలేదన్నారు. 1978 లో బీసీల కోసం ‘మండల్ కమిషన్’ ఏర్పాటుతో 40 సిఫార్సులు అందించిందని, వాటిని కూడా బుట్టదాఖలు చేశారన్నారు. ప్రధానమైనది ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ల సిఫార్సును 1990 లో ఎన్‌టిఆర్ ఛైర్మనుగా ఉన్న నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వమే అమలు కారణంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఓబిసిలు 27 శాతం రిజర్వేషన్లను బిసిలు పొందగలుగుతున్నారన్నారు. 1995-2004 మధ్య కాలంలో తెలుగుదేశం- పాలనలో చంద్ర‌బాబు నాయుడు బిసిలకు సామాజిక న్యాయం చేశార‌న్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో1995 నుంచి 2004 మే వరకు అధికారంలో ఉనప్పుడు బిసిల సంక్షేమ బడ్జెట్ కేటాయింపులు మొదలుకొని. బిసిలను విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తేవడానికి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్నామ‌న్నారు. “వెలుగు” వంటి వినూత్న పేదరిక నిర్మూలన జరిగిందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వెనుకబడిన కులాలను పైకి తేవడానికి వివిధ జిఓలు ఇచ్చామ‌ని తెలిపారు. గీత కార్మికులకు తాటి, ఈత వనాలను పెంచుకునేందుకు 5 ఎకరాల భూమిని జీవో నెం.560 ఇచ్చారని, గొర్ల కాపరులకు బంజర భూములు, చెరువులు, కుంటలలో మేపుకోసం 559 జీవో ఇచ్చారన్నారు. రోడ్లకు ఇరువైపులా తుమ్మచెట్లను గొర్లకాపరుల నిమిత్తం 1016 జీవో, నాయీ బ్రాహ్మణులు తీర్థ స్థలాలలో పుట్టు వెంట్రుకలు గాను 254 జీవో, మత్స్యకారులకు సబ్సిడీ కింద చేప పిల్లలు, వలలు, సైకిళ్లు, పడవల కొరకు 353 జీవో, చేనేత రంగాన్ని సగం ధరకే జనతా వస్త్రాలు, 10 శాతం సబ్సిడీతో రూ.10 కోట్లు ఆప్కోకు 50 శాతం విద్యుత్ సబ్సిడీ, ‘ఆదరణ’ పథకంతో చేతివృత్తుల వారికి ఆధునిక పనిముట్లను టిడిపి ప్ర‌భుత్వం అందించిన‌ట్టు తెలిపారు. బీసీ విద్యార్థులకు ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్లు, 61 ఆశ్రమ పాఠశాలలు 1427 హాస్టళ్ల ఏర్పాటు, రజక కార్పొరేషన్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ల ఏర్పాటు చేశామ‌ని, బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలకు ఎన్టీఆర్ పార్టీ టిక్కెట్ల కేటాయించడంతో చట్ట సభలకు ఎన్నికయ్యారని తెలిపారు.

1996 లోనే రాష్ట్ర శాసనసభలో వెనుకబడిన తరగతుల వారికి 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేలా రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేశామ‌న్నారు. కాబట్టి కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే బిసిలకు స్వర్ణయుగం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, నాయ‌కులు ఎస్.ప్రకాష్, శ్రీపతి సతీష్, శ్రీనివాస్ నాయుడు, బోసు, ఎం.సిద్దీఖి, నాగు నగేష్, కట్టరాములు, బాలాజీ గోస్వామి, కిరణ్, శ్యామ్ సుందర్, ఎం.రాజు, బాలకృష్ణ, సుజాత, వీరబాబు, గౌరి శంకర్, భానుప్రకాష్, ప్రదీప్ గౌడ్, చంద్రమోహన్ గౌడ్, ఎం.నర్సింహ, ఓ.వెంకటేష్, విఠ్టల్, భవాని శ్రీనివాస్, బోనాల శ్రీనివాస్, వెంకట్రాజం, బివై.శ్రీకాంత్, జోగిందర్, రామారావు, ప్రసాద్, మతిన్, సురేష్, దూడల సాంబమూర్తి, ఎన్.జగదీష్ గౌడ్, సుక్రవేది, తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page