అరుంధతినగర్‌లో మంచినీటి, సివ‌రేజి పైప్‌లైన్ పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

అరుంధతినగర్‌లో మంచినీటి, సివ‌రేజి పైప్‌లైన్ పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, అక్టోబ‌ర్ 18, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అరుంధీన‌గ‌ర్లో మంచినీటి, సివ‌రేజి పైప్‌లైన్ ప‌నుల‌ను స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ శ‌నివారం ప‌ర్య‌వేక్షించారు. వరుస పండుగల కారణంగా స్థానికుల కోరిక మేరకు 2 నెలల స్వల్ప అంతరాయం తరువాత తిరిగి మొదలైన మంచినీటి, సివ‌రేజి పైప్‌లైన్ ప‌నుల‌ను జలమండలి అధికారులు, బిజెపి నేతలు, స్థానికులతో కలిసి పర్యవేక్షించిన కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ… గత 2 నెలల్లో సాగిన పండుగల కారణంగా రోడ్డు తవ్వితే బస్తీలో గణేష్ చవితి, నవరాత్రి ఉత్సవాల మండపాల ఏర్పాట్లలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతాయని బస్తీ వాసులు చేసిన విజ్ఞప్తుల‌తో పనులను తాత్కాలికంగా నిలిపివేశారని తెలిపారు.

తిరిగి మొదలైన పనులను త్వరగతిన పూర్తి చేసి బస్తీ వాసులకు అందుబాటులోకి తేవాలని వాటర్ వర్క్స్ అధికారులకు, కాంట్రాక్టర్ ల‌కు కార్పొరేటర్ పావ‌ని ఆదేశాలిచ్చామ‌న్నారు. ఈ పనుల పర్యవేక్షణలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, వాటర్ వర్క్స్ డిజిఎం కార్తీక్ రెడ్డి, మేనేజర్ కృష్ణ మోహన్, వర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ శంకర్, మల్లేష్, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నవీన్, ఆనంద్‌రావు, ఎం.ఉమేష్, గోపి, శ్రీనివాస్ గౌడ్, పలువురు బస్తీ వాసులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page